పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అయిదు మధ్య ఆసియా దేశాలు శుక్రవారం మద్దతు ప్రకటించాయి..ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నవారిని, వారికి ఆర్థికంగా అండగా ఉంటున్నవారిని బాధ్యులుగా చేసి శిక్షించాలని ఈ దేశాలు డిమాండ్ చేశాయి. దిల్లీలో జరిగిన ఇండియా – మధ్య ఆసియా దేశాల సదస్సులో ఉగ్రవాదం అణచివేతపై ప్రధానంగా చర్చ కొనసాగింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో కజకస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఐరాస భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండుకు ఈ దేశాలు మద్దతు ప్రకటించాయి..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.