వందే భారత్‌ స్లీపర్‌ రైలు పరుగులు తీసేందుకు రెడీ..!

వందే భారత్‌ స్లీపర్‌ రైలు పరుగులు తీసేందుకు రెడీ అయిపోయింది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ రైలును ప్రారంభించేందుకు రైల్వే శాఖ అన్ని ఏర్పాటు చేసేసింది…తాజాగా బీజేపీ అధికారిక ఎక్స్‌ హ్యాండిల్‌లో రైలు లోపల ఎలా ఉందో వీడియోలో చూపించారు. ఆ విజువల్స్‌ చూస్తుంటే ఓ లగ్జరీ విమానం ఇంటీరియర్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది.

రైలు ప్రయాణాలు ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా, వేగంగా, ప్రీమియంగా మారనున్నాయి. త్వరలో దేశంలో మొట్టమొదటి స్లీపర్ వందే భారత్ పాట్నా-న్యూఢిల్లీ ట్రాక్‌ పరుగులు తీయనుందని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. వీడియోలో ఆధునిక, హైటెక్ ఇంటీరియర్‌లను చూపించారు. ఈ రైళ్లలో వై-ఫై, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు, సిసిటివి-మానిటరింగ్ కోచ్‌లు ఉంటాయి, ఇవి ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. స్లీపర్ వందే భారత్ గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తుంది, సాంప్రదాయ రైళ్లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది..