ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని కి శ్రీకారం.. సీఎం రేవంత్ రెడ్డి…

ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Indira Saura Giri Jal Vikasam scheme to be launched Today In Telangana

అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో పథకాన్ని ప్రారంభించనున్నారు రేవంత్ రెడ్డి. రూ. 12,600 కోట్ల బడ్జెట్‌తో “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకం ప్రారంభం కానుంది. ఒక్కో యూనిట్‌కు రూ. 6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు అందించనుంది. ఈ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి… ఈ కార్యక్రమం అనంతరం స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చేరుకోనున్నారు. కొండారెడ్డిపల్లెలో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం కొండారెడ్డిపల్లె నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.