పైలెట్ గ్రామంలోనే పైసా వసూల్!
జాన్పడ్లో ఇందిరమ్మ బిల్లుల మంజూరీకి ముడుపులు
లబ్ధిదారునికి, పంచాయతీ కార్యదర్శి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్
జాన్పహాడ్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు
పాలకవీడు, మండలంలోని జాన్పహాడ్ ఇందిరమ్మ ఇండ్ల మంజూరీకి పైలెట్ గ్రామంగా ఎంపికైంది. పంచాయతీ పరిధిలో 157 మందికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. ..కాగా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరు కోసం లబ్దిదారుల నుంచి పంచాయతీ కార్య దర్శి పైసలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…. అందుకు సంబంధించిన ఆడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది… సోమవారం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఓ లబ్దిదారుడి కుటుంబ సభ్యులకు, పంచాయతీ కార్యదర్శి మధ్య జరి గిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వారి మధ్య జరిగిన సంభాషణలో బిల్లుల మంజూరీకి 2 శాతం కమీ షన్ ఇవ్వాల్సి ఉంటుందని, సదరు పంచాయతీ కార్యదర్శి లబ్ధిదారుడిని అడినట్లుగా ఉంది. ఈ కమీషన్లో ఏఈకి డీఈకి సైతం వాటా ఉంటుందని, ‘వారు నేరుగా మిమ్మల్ని అడగలేరు’ అందువల్ల తాను అడుగుతున్నట్లు పేర్కొనడం గమనార్హం. …
పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే ఇలా అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు..
కాగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల మంజూరు కోసం లబ్దిదారులను పంచాయతీ కార్యదర్శి పైసలు అడిగినట్లు వైరల్ అయిన సంభాషణలను చూస్తుంటే ఇందులో చాలామంది పెద్దలు కూడా ఉన్నారని పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు…. అధికార పార్టీ నాయకులు కూడా కొందరి హస్తం ఉన్నట్లుగా కొందరు ఆరోపిస్తున్నారు… పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. నిరుపేదల్ని కాకుండా ఇస్తానుసారంగా పార్టీలకి వ్యక్తులకి మద్దతులు ఉండే వారికి మాత్రమే ఇచ్చారని నిజమైన ఇందిరమ్మ ఇళ్ళ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…. అసలు ఇల్లు లేకనే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తమ దగ్గరే డబ్బులు పట్టిపీడిస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయని ,, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇలాంటి పైలట్ గ్రామాలు ఉన్నాయని వాటి వద్ద కూడా ఎన్ని అక్రమాలు జరిగాయో వెలికి తీయాలని ఆ గ్రామాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
సేకరణ..
షేక్. మహబూబ్ అలీ.
పాలకీడు జర్నలిస్ట్..