*BIG BREAKING*
ఢిల్లీ & పంజాబ్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ ఆగిపోయింది, లైట్లు ఆపివేయబడ్డాయి.
హిమాచల్‌లోని ధర్మశాలలో మ్యాచ్ జరుగుతోంది.
స్టేడియం ఖాళీ అవుతోంది. ఆటగాళ్లను సురక్షిత ప్రదేశాలకు తరలించారు..
ధర్మశాలలో బ్లాక్ అవుట్! మధ్యలోనే ఆగిపోయిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్..
IPL 2025:
బ్లాక్ అవుట్ కారణాలతో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్ కింగ్స్ వర్సస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్..
BCCI/IPL
ఆపరేషన్ సింధూర్‌కి ప్రతీకారంగా పాకిస్తాన్ తిరుగు దాడులు ప్రారంభించింది. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్ టార్గెట్‌గా దాడులకు దిగింది. దీంతో ఈ రాష్ట్రాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించారు. ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఎమర్జెన్సీ గేట్లు తెరిచి, స్టేడియంలో ఉన్న 25 వేల మంది ప్రేక్షకులను వెళ్లిపోవాల్సిందిగా బీసీసీఐ కోరింది..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్, 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య అవుట్ కాగానే స్టేడియంలో ఫ్లడ్ లైట్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగిందని అంతా అనుకున్నారు. అయితే సెక్యూరిటీ నిమిత్తమే ఫ్లడ్ లైట్స్ ఆఫ్ చేసి, మ్యాచ్‌కి ఆపేసినట్టుగా తెలిసింది..
ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టుగా బీసీసీఐ స్టేట్మెంట్ ద్వారా తెలియచేసింది…
మ్యాచ్ ఆగిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే పంజాబ్ కింగ్స్ నేరుగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించి ఉండేది. ఇప్పుడు మరో మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో కచ్ఛితంగా గెలవాల్సి ఉంటుంది…
ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద షాక్. సాంకేతిక కారణాల వల్ల ధర్మశాలలో వేదికగా జరుగుతున్న మ్యాచ్ రద్దయ్యింది. పంజాబ్ ఇన్నింగ్స్ మధ్యలో ఫ్లడ్ లైట్ వెలగకపోవడంతో.. సాంకేతిక కారణాలతో మ్యాచ్‌ను ఆపేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించనున్నారు..వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ చివరకు ఫలితం తేలకుండానే రద్దయ్యింది. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 10.1 ఓవర్ వద్ద ఫ్లడ్ లైట్ హఠాత్తుగా ఆగిపోయింది. దాన్ని సరిచేసేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ, అది వెలగకపోవడంతో ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ 21:57 గంటలకు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది..