ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం..

2025 IPL లో భాగంగా వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది…

ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయాన్ని సాధించింది..210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఓ దశలో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికి.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ గెలిచింది.

ఈ మ్యాచ్ లక్నో ఓడిపోవడంతో క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం ఒక్కరిపైనే పడింది. అతడు మరెవరో కాదు లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కు సంజీవ్ గొయెంకా క్లాస్ పీకుతున్నట్లుగా కనిపించింది. బౌండరీ లైన్ ఆవల డగౌట్‌లో రిషబ్ పంత్‌ను గొయెంకా ప్రశ్నిస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…….లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (75; 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (72; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, విప్రజ్ నిగమ్, ముకేశ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు..