ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు..ఢిల్లీకి ఘోర పరాజయం…!

ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లే తర్వాత అత్యల్ప స్కోర్లు:

13/6 – DC vs RCB (న్యూ ఢిల్లీ, 2026)
14/2 – RR vs RCB (కేప్ టౌన్, 2009)
14/3 – SRH vs RR (పుణె, 2022)
15/2 – CSK vs KKR (కోల్‌కతా, 2011
).

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC) 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఆర్‌సీబీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది..కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభం నుంచే వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. యువ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30 పరుగులు) ఒక్కడే పోరాటం చేసినా, మిగిలిన వారు చేతులెత్తేయడంతో ఢిల్లీ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్‌సీబీ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది.

బెథెల్ మెరుపులు.. పడిక్కల్ విధ్వంసం:
76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. యంగ్ ఓపెనర్ జాకబ్ బెథెల్ (20) రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ బాది జోరు ప్రదర్శించాడు. అయితే కైల్ జేమీసన్ బౌలింగ్‌లో నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి బెథెల్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 13 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 34 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు.

కింగ్ కోహ్లీ ఫినిషింగ్:
ఒకవైపు పడిక్కల్ దంచుతుంటే, మరోవైపు కింగ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా, పవర్ ప్లే ముగిసిన వెంటనే తన బ్యాటింగ్ గేర్ మార్చాడు. వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను స్టైలిష్‌గా ముగించాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవడమే కాకుండా, తమ నెట్ రన్ రేట్‌ను కూడా +1.919గా మెరుగుపరుచుకుంది. మరోవైపు, 76 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకోవడంలో ఢిల్లీ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కైల్ జేమీసన్ ఒక్కడే ఒక వికెట్ తీయగా, మిగిలిన బౌలర్లు ఆర్‌సీబీ బ్యాటర్ల దాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఘోర ఓటమితో ఢిల్లీ జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది..

ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు.

ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ విధ్వంసానికి తోడు బౌలర్ల ధాటికి ఢిల్లీ కకావికలమైంది. ఫలితంగా ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ 9000 పరుగుల మైలురాయికి కేవలం 11 పరుగుల దూరంలో ఉన్నాడు. 76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీ, ఆరంభం నుంచే దూకుడుగా ఆడి ఈ ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 8 సెంచరీలు, 66 అర్ధ సెంచరీలతో కోహ్లీ తన ఆధిపత్యాన్ని చాటుతున్నాడు. 2026 సీజన్‌లో కోహ్లీ భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 54.66 సగటుతో 328 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు…

హాజిల్వుడ్ అద్భుత ప్రదర్శన

హాజిల్వుడ్ తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. చివర్లో అద్భుత యార్కర్‌తో చివరి వికెట్ తీసి నాలుగు వికెట్లు సాధించాడు. ఈ విజయం ఆర్సీబీకి భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది..

భువనేశ్వర్, హాజల్‌వుడ్ హవా..

బెంగళూరు తరఫున బౌలింగ్ ప్రారంభించిన భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్వింగ్‌తో ఢిల్లీ ఓపెనర్లను కంగుతినిపించారు. తన రెండు ఓవర్ల స్పెల్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జోష్ హాజల్‌వుడ్ తన వంతుగా 2 ఓవర్లు వేసి 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. వీరిద్దరి ధాటికి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. సాహిల్ పరాఖ్, కె.ఎల్. రాహుల్, సమీర్ రిజ్వీ, నితీష్ రాణా వంటి స్టార్ ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు.

ఢిల్లీ కష్టాల్లో.. నితీష్ రాణాపైనే భారం..

ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మిల్లర్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పోరెల్ ఉన్నారు. జట్టు స్కోరు 6 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరగడం జట్టును మరింత ఆత్మరక్షణలో పడేసింది. ఈ క్లిష్ట సమయంలో డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపిస్తారో లేదో చూడాలి. ఒకానొక దశలో ఢిల్లీ జట్టు అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో కనిపిస్తోంది.