తుంగభద్ర నది, ఈసారి ఎల్ నినో ప్రభావం తో వరుణుడి కరుణ లేక బోసిపోయి కన్నీరు పెట్టిస్తుంది. ఎగువన కర్ణాటకలోనూ వర్షాభావం తీవ్రమవ్వడంతో సుంకేసుల బ్యారేజీ వద్ద కనుచూపు మేరలో నీటి జాడ కూడా కనిపించడం లేదు. పారే నది కాస్తా ఎడారిలా మారిపోవడంతో, దిగువ ప్రాంతాలకు చుక్క నీరు కూడా వారని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి పగబట్టిన వేళ రాబోయే వేసవిలో రోజుల్లో నీటి తిప్పలు ఎలా ఉంటాయోనని స్థానికులు తల్లడిల్లిపోతున్నారు. దీనికి తోడు సుంకేసుల బ్యారేజీ పైన ఉన్న తుమ్మిళ్ల నీటి ప్రవాహం కూడా పూర్తిగా పడిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే, రానున్న రోజుల్లో సాగు నీరు దొరకక ఎకరాకి ఎంత నష్టం వస్తుందోనని చేసిన అప్పులను లెక్కలు వేసుకుంటూ… రోజులు ఎలా గడిచి పోతాయో తెలియని పరిస్థితి అన్నదాతలు తీవ్ర ఆందోళనను కలిగిస్తుంది…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.