ఇజ్రాయెల్ గూఢచారులు ముగ్గురికి ఉరి…!

ఇజ్రాయెల్‌ గూఢచారులు గా పని చేస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ ముగ్గురిని ఉరి తీసింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మరో 700 మందిని అరెస్టు చేసింది…వీళ్లంతా మొస్సాద్ కోసం పని చేస్తున్నారని చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ మీడియా బుధవారం పేర్కొంది. అయితే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన మరుసటి రోజే.. ఇరాన్ ఉరిశిక్షలు అమలు చేయడం, అరెస్టులు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అమెరికా మధ్యవర్తిత్వంతో 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే దాన్ని ఉల్లంఘించాయి..

తుర్కియే సరిహద్దుకు సమీపంలో ఉన్న వాయవ్య నగరమైన ఉరి్మయాలో ఈ ఉరిశిక్షలు అమలు జరిగాయి. నీలిరంగు జైలు యూనిఫాంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల ఫోటోను కూడా కోర్టు పంచుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్‌ వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇరాన్‌లో ప్రధాన ప్రత్యర్థి ఇజ్రాయెల్‌తో సహా విదేశీ నిఘా సేవలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఏజెంట్లను అరెస్టు చేయడం, ఉరితీయడం తరచుగా జరుగుతుంది. జూన్‌ 13న ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత, ఆ దేశంతో సంబంధాలున్న వ్యక్తులపై త్వరిత చర్యలు తీసుకుంటామని టెహ్రాన్‌ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపథ్యంలోనే దోషులుగా తేలిన అనేక మంది వ్యక్తులను ఇరాన్‌ ఉరితీసింది..