TG: BRSను BJPలో విలీనం చేసేందుకు కుట్ర జరుగుతోందన్న కవిత కామెంట్స్ను ఆ పార్టీ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరోక్షంగా ఖండించారు. బీజేపీలో విలీనం కాదు కదా.. కనీసం పొత్తు కూడా ఉండదని తేల్చిచెప్పారు. గతంలో పొత్తు లేనప్పుడే అద్భుత విజయాలు సొంతం చేసుకున్నట్లు గుర్తుచేశారు.
ఇకపైనా పొరపాటున కూడా BJPతో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు. BRS అధినాయకుడు కేసీఆరేనని, ఆయన మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు…
మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పాలనను చూస్తున్న రాష్ట్ర ప్రజలంతా.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఏ పార్టీలో అయినా చిన్న చిన్న సమస్యలు కామన్.. అన్ని త్వరలోనే సర్దుమణుగుతాయ్ అని చెప్పారు.