180 మంది గురుకుల విద్యార్థులను చంపిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి
కేసీఆర్ రాక ముందు 200 గురుకుల పాఠశాలలు ఉంటే.. కేసీఆర్ వచ్చాక వాటిని 1000 చేశాడు
నేను మంత్రిగా ఉన్నప్పుడు గురుకులంలో సీటు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి పైరవీ చేసేవారు
ఇప్పుడు మాకు సీటు వద్దు ఏం వద్దు అని టీసీలు తీసుకొని పోతున్నారు.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గురుకుల విద్యార్థులకు భోజన సదుపాయాలు ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పాఠశాలల స్థాయిలో ఉండాలని కేసీఆర్ ఆదేశించాడు
అప్పట్లో అత్యుత్తమ పాఠశాలలు తిరిగి మెనూ చేసుకొచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూసేవాళ్లం
కానీ ఇప్పుడు గురుకుల భోజనాల టెండర్లు కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడంతో, వాళ్లు కుళ్లిపోయిన కూరగాయలు, ముక్కిపోయిన బియ్యం తెచ్చి వంటలు వండుతున్నారు
అవి తిని 180 మంది విద్యార్థులు చనిపోయారు.. వేలాది మంది పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు…
గతంలో గురుకులాల్లో తమ పిల్లలకు సీటు కావాలని తల్లిదండ్రులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగేవారని, కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు తల్లిదండ్రులు భయపడి తమ పిల్లలకు టీసీలు (Transfer Certificates) తీసుకుని వెళ్లిపోతున్నారని ఆయన విమర్శించారు….ఇంతకుముందు ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతూ, రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని జగదీష్ రెడ్డి గతంలోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు… కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ మరియు గురుకులాల నిర్వహణ పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరసనల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు…