స్వీయ గణన విధానం..

స్వీయ గణన విధానం (Steps):.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన డేటా ఆధారంగానే ప్రజలకు అవసరమైన విధానాలు, ప్రణాళికలు రూపొందిస్తాయని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. దేశంలో 16 ఏళ్ల తర్వాత నిర్వహించనున్న ఈ జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించడం వల్ల ఇది చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జరుగుతున్న తొలి జనగణన ఇదేనని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ఆమె జనగణన వివరాలను వెల్లడించారు. సమావేశంలో జనగణనకు సంబంధించిన ప్రత్యేకంగా రూపొందించిన టేబుల్ క్యాలెండర్, టీ కప్‌ను ఆవిష్కరించారు..

*స్వీయ గణన (Self Enumeration)* *కోసం అధికారిక పోర్టల్ అడ్రస్:
https://se.census.gov.in

1. అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
2. కుటుంబాధిపతి పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
3. OTP ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి.
3. జిల్లా, పిన్ కోడ్, గ్రామం/పట్టణం వివరాలు ఇవ్వాలి.
4. మ్యాప్‌లో నివాసాన్ని ఖచ్చితంగా గుర్తించాలి.
5. గృహం, కుటుంబం, సౌకర్యాలు, ఆస్తులపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
6. వివరాలను పరిశీలించి “Final Submit” చేయాలి.
7. సమర్పణ అనంతరం లభించే SE IDను భద్రపరచుకోవాలి.