జూనియర్ ఎన్టీఆర్‌కు స్వల్ప గాయం.!

టాలీవుడ్ హీరో(Tollywood Hero) జూ.ఎన్టీఆర్(jr ntr) గాయపడ్డారు. ఓ ప్రైవేట్ యాడ్ షూటింగ్(Pvt Ad Shooting) లో ఆయన ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది…వెంటనే మెడికల్ టీమ్‌ ప్రాథమిక చికిత్స అందించింది. స్వల్ప గాయమే కావడంతో ఎన్టీఆర్‌ ఆరోగ్యం సవ్యంగా ఉందని టీమ్‌ తెలిపింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. తారక్ త్వరగా కోరుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే పలువురు సెలబ్రిటీలు ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నట్లు సమాచారం.

“జూనియర్ ఎన్టీఆర్‌ ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. వైద్యుల సలహా మేరకు, పూర్తిగా కోలుకోవడానికి ఆయన వచ్చే రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటారు. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభిమానులు, మీడియా, ప్రజలు ఎటువంటి ఊహాగానాలు వ్యాప్తి చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము” అని ఎన్టీఆర్ టీం ప్రకటన విడుదల చేసింది..