తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడంతో ఇప్పుడు అందరి దృష్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేవని స్పష్టమవుతున్న వేళ రేవంత్ రెడ్డికి మరో భారీ షాక్ తగలనున్నట్లు కనిపిస్తోంది..పాలనలో విఫలమవడంతో.. ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయిన ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు పరిహారం విషయంలో రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడంపై ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు త్రిబుల్ ఆర్ బాధితులు సిద్ధమయ్యారు..రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కింద భూములు తీసుకున్న ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వడం లేదని బాధిత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలు విధాలుగా ఆందోళనలు చేస్తున్నారు. వివిధ రీతిలో నిరసనను చేస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడంతో ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల బరిలో ఎక్కువమంది పోటీలో ఉంటే అందరి దృష్టి ఆ ఎన్నికలపైనే ఉండే అవకాశం ఉంది.
గతంలో ఇదే మునుగోడు నియోజకవర్గం చెందిన ఫ్లోరోసిస్ బాధితులు పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నుంచి వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో పాటు పోటీలో నిలిచి తమ బలాన్ని కేంద్ర ప్రభుత్వం వరకు వినిపించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం శివన్న గూడెం కిష్టరాయపల్లి ప్రాజెక్టుల బాధితులు కూడా పోటీ చేసేందుకు సిద్ధమవగా అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బాధితులతో చర్చలు జరిపి పోటీలో నిలవకుండా చేసింది.
2019 లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి పసుపు రైతులు వందల సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఎంపీగా కవితను ఓడించారు.
పై సంఘటనలను ఉదాహరణగా తీసుకుని త్రిబుల్ ఆర్ బాధితులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రెండు, మూడు రోజులు..