ఆన్‌లైన్‌లో నామినేషన్‌ పత్రాలు..

షేక్‌పేట ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సన్నద్ధతను ఆర్వో, ఏఆర్వోలతో సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా ఈసీఐ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రిటర్నింగ్‌ అధికారి సాయిరాంకు సూచించారు.

ఆన్‌లైన్‌లో నామినేషన్‌ పత్రాలు..

సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్లు స్వీకరించే సమయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్‌ పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఆన్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయవచ్చు. అయితే ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేసినప్పటికీ స్వయంగా అభ్యర్థి హాజరు కావాల్సి ఉం టుంది. సంతకం, ప్రమాణం కోసం తప్పనిసరి. నామినేషన్ల స్వీకరణ గడువు సమయం ముగిసేలోగా హాజరు కావాల్సి ఉంటుంది.

ఇక బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్‌ సతీమణి మాగంటి సునీతా గోపీనాథ్‌ బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ యాదవ్‌ పోటీ చేయనున్నారు. ఇక నేడో రేపో బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది..

జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి.

జూబ్లీహిల్స్ ఓట్ చోరీ బాగోతంపై విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి

ఇటీవల ఓట్లు నమోదు చేయించి, దొంగ ఓటర్ ఐడీ కార్డులు పంపిణి చేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్

యూసుఫ్ గూడ డివిజన్ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదు

దీనిని సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించిన ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్..