గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తా..సర్పంచ్ బచ్చలకూరి శ్రీను.

*హుజూర్నగర్..*

గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తా.. -సర్పంచ్ బచ్చలకూరి శ్రీను.

*కల్మలచెరువు..సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన బచ్చలకూరి శ్రీను..

కల్మలచెరువు గ్రామ సర్పంచిగా మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బచ్చలకూరి శ్రీను..MA.,B.ed చదివిన వ్యక్తి ఘన విజయం సాధించిన సందర్భంగా.. 22 తారీకు సోమవారం నాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో.. గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ ప్రత్యేక అధికారి సమక్షంలో…

ఊరందరి సమక్షంలో సర్పంచ్ గా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన బచ్చలకూరి శ్రీను..

కల్మలచెరువు ఊరంతా పండుగ వాతావరణం.. దారులన్నీ గులాబీ మయం..

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఊరి ప్రజలంతా ఘన స్వాగతం.. పలికి అభినందనలు,శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయాలకతీతంగా ప్రమాణస్వీకారం వేడుకల్లో పాల్గొన్న ఆయాపార్టీల నాయకులు కార్యకర్తలు..

కల్మలచెరువు గ్రామ ప్రజలకు అయన చేసిన సేవలను వారి అనుబంధాన్ని పంచుకుని.. మీ సేవ సేవలను కొనియాడిన మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ప్రముఖులు.. కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు…

* ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు గెలుపు కోసం కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముఖ్యంగా విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

*ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ..* గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని, గ్రామ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు..ఈ పదవి ప్రజల కోసం, గ్రామ అభివృద్ధి కోసం
పూర్తి స్థాయిలో వినియోగిస్తామని అన్నారు సర్పంచ్ పదవిని చేపట్టడమే కాదు..ఆ పదవికి వన్నె తెచ్చేలా పని చేస్తామని ఆ పదవికి గౌరవం వచ్చేలా ప్రజలతో కలిసి పని చేస్తామని అన్నారు.