బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడిని ఖండిస్తున్నాం…brs
కరీంనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి Padi Kaushik Reddy పై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా? లేనట్లా?
ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అత్యంత దురదృష్టకరం..
దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని, రాష్ట్రంలో శాంతి భద్రతలను తెలంగాణ డిజిపి కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఇలాంటి దాడులు ఆపకపోతే… ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం…brs..
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై బండి సంజయ్ అనుచరుల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ పట్టణంలో బీజేపీ గుండాలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పై కర్రలు, రాడ్లతో దాడి చేసి కిటికీల అద్ధాలు పగులగొట్టారని తెలిసిందే. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు… నేపథ్యంలో కేటీఆర్ ఎమ్మెల్యే పార్టీ కౌశిక్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి నాయకులు, కార్యకర్తల యోగక్షేమాల అడిగి తెలుసుకున్నారు. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే, ఆయన అనుచరులు దాడి చేయడం అత్యంత దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..