పాకిస్థాన్ పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ ఇవ్వాలి వ్యాఖ్యలు…

పాక్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత్ ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందా అని యావత్ దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక మంత్రి BZ జమీర్ అహ్మద్‌ఖాన్ (BZ Zameer Ahmed Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ (Suicide Bomb) ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య అని అభివర్ణించారు. ఈ సమయంలో ప్రతి భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. పాకిస్థాన్ భారత్‌కు ఎప్పుడూ శత్రువేనని, ప్రధాని నరేంద్రమోడీ (PM Modi), కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) అనుమతిస్తే తాను యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తామెప్పటికీ భారతీయులం, హిందుస్థానీయులమేనని, సూసైడ్ బాంబ్ ఇస్తే దానిని తీసుకుని పాకిస్థాన్‌పై దాడి చేస్తానన్నారు..

అయితే ఈ విషయంపై సోషల్ మీడియాలో కొంత సెటైరికల్ మెసేజ్ ఎదురవుతున్నాయి.. మీ ముఖ్యమంత్రి తో పాటు అందరూ కూడా పాకిస్తాన్తో యుద్ధం వద్దని నీకు మాత్రమే బెల్టు బాంబు ఎలా ఇస్తామంటూ ప్రశ్నిస్తున్నారు..