కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం.. జీ-రామ్-జీ పథకం ప్రసంగంపై వివాదం..
ఇవాళ కర్నాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ప్రభుత్వ విధానాల, ప్రాధాన్యతలను వివరిస్తూ ప్రసంగించాల్సి ఉంది. అయితే ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సరిదిద్దడానికి ఉద్దేశించిన కేంద్ర చట్టాన్ని ప్రస్తావించే కొన్ని పేరాలను చదివేందుకు గెహ్లాట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రసంగం ప్రభుత్వ ప్రచారమని వాదించారు. చివరికి చదవకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు..
సభలో ప్రసంగించకుండా వెళ్లిపోయిన గవర్నర్. ప్రభుత్వం ఇచ్చిన కాపీ.. జీ-రామ్-జీ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని అభ్యంతరం. గవర్నర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నినాదాలు. గవర్నర్ తీరు సరిగా లేదు..
సభలో ప్రసంగించడం రాజ్యాంగ విధి. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ చదవాలి: సీఎం సిద్దరామయ్య.
గవర్నర్ అభ్యంతరాలివే..
ఈ వివాదానికి మూలం గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చేర్చిన కొన్ని పేరాలు. ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఆజీఏ (MGNREGA) రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రాన్ని విమర్శించడం, కర్ణాటకకు నిధుల పంపిణీ విషయంలో అన్యాయం జరిగిందని వ్యాఖ్యలు ఉండడం. థావర్ చంద్ గెహ్లాట్ వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. తొలగించాలని కోరారు. తొలగించకపోతే ప్రసంగం ఇవ్వబోనని లోక భవన్ వర్గాల ద్వారా ప్రభుత్వానికి కబురు పంపారు.
గవర్నర్ ప్రసంగం అనేది ప్రభుత్వ విధానాల ప్రతిబింబం మాత్రమే. గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పే వేదిక కాదు. ప్రసంగం ఇవ్వకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ అంశం మీదే సుప్రీం కోర్టులో వాదనలు జరిగే చాన్స్ ఉంది.
కోర్టు ఏం చెప్పిందంటే..
గతంలో గవర్నర్లు ప్రసంగాలు చదవకపోవడం.. మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం లాంటి ఘటనలు జరిగాయి. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో అప్పటి కేరళ గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ప్రసంగం మొత్తం చదవకుండా మధ్యలో వెళ్లిపోయారు. ఆ సమయంలో పినడ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే.. ప్రసంగం మొత్తం చదవడం గవర్నర్‌కున్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని టైంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2024-2025 మధ్యకాలంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా..
గవర్నర్ ప్రసంగం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు.. గత ఏడాది పని తీరును ప్రతిబింబించే అధికారిక ప్రకటన. ఏ రాష్ట్రంలోనైనా సరే శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం కావాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ఈ విషయాన్నే స్పష్టంగా చెబుతోంది. ఒకవేళ.. గవర్నర్ ప్రారంభోపన్యాసం ఇవ్వకపోతే శాసనసభ ప్రారంభం జరగదు!. ఇది రాజ్యాంగపరమైన ప్రక్రియలో అంతరాయం కలిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మార్గం ఉంది.
గవర్నర్ గనుక ప్రసంగం ఇవ్వనని చెబితే.. ఆ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ను ఆశ్రయించవచ్చు. ఇవాళ జరగబోయే ఉమ్మడి శాసనసభ సమావేశంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్(Thawar Chand Gehlot) ప్రసంగం ఇవ్వకపోతే.. సిద్ధరామయ్య ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది…
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959