కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం…బైక్‌ను ఢీకొట్టడంతో బస్ లో మంటలు…భారీగా ప్రాణ నష్టం..

*కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం*…..

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం….

మితిమీరిన వేగంతో బైక్‌ను ఢీకొట్టడంతో బస్ లో మంటలు..- ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు….

సురక్షితంగా బయటపడ్డ 12 మంది –
భారీగా ప్రాణ నష్టం ఉంటుందని అంచనా…హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు.. కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పది మంది చనిపోగా 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు సమీపంలోని చిన్నటేకూరులో ఓ బైక్ బస్సును ఢీకొట్టి బస్సు కిందకు దూసుకెళ్లి ఇంధన ట్యాంకును ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగినట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత మంటలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చాయి. ఏసీ బస్సు కావడంతో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు బద్దలు గొట్టి ప్రాణాలతో బయటపడ్డారు. ఇలా దాదాపు 12 మంది వరకు ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది.

ప్రమాద సమయంలో అక్కడున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాకుండా ఒకరిద్దరు ఈ ప్రమాదంలో గాయపడినవారిని తమ వాహనాల్లో కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది.. పలువురికి గాయాలు కాగా వారందరిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు..ఈ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిలో 12 మంది బస్సు ఎమర్జెన్సీ డోర్ పగులగొట్టి బయటపడ్డారని చెబుతున్నారు.. మిగిలినవారి పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఈ ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్, క్లీనర్ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో జరిగింది..

*🔹కర్నూలు జిల్లా, కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు*

*కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305*

*కర్నూలుప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059*

*ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061*

*కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075*

*కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు:*

*9494609814*
*9052951010*

*బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు*

*డా.ఏ.సిరి, జిల్లా కలెక్టర్, కర్నూలు*