సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు గంటన్నర సేపు రాజకీయాంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్లు తెలిసింది..సమావేశం అనంతరం మీడియా సమావేశంలో కొండా సురేఖ మాట్లాడారు. ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం, తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె తాజాగా ఆమె స్పందించారు. తమ ఇంటికి పోలీసులు రావడంతోనే తన కూతురు ఆవేశంతో మాట్లాడిందన్నారు. తన కూతురు మాటలకు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు. తమ మధ్య విభేదాలు లేవన్నారు. అన్ని సమిసిపోయాయని.. అన్ని పార్టీల్లో వచ్చినట్టే తమ పార్టీలో కూడా ఏదో అపార్థం చేసుకున్నాం. దాంతో కొన్ని గొడవలు రావడం జరిగిందన్నారు. కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే.. మా కుమార్తె ఆ రోజు పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రిపై అలా మాట్లాడింది.. ఈ విషయంలో నేను క్షమాపణ చెప్తున్నాను.. అందరం సర్దుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నానన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.