అమీర్ పేట్ మైత్రివనం ఎదురుగా అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత..

అమీర్ పేట్ మైత్రివనం ఎదురుగా అగ్నిప్రమాదం జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత..
ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన కవిత అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ
అమీర్ పేట్ లో జరిగిన అగ్నిప్రమాదం సడెన్ గా జరిగింది కాదు. అగ్ని ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని మూడు నెలలుగా అధికారులకు చెబుతూనే ఉన్నారు. కానీ అధికారులు నిర్లక్ష్యం చేయటం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. అగ్నిప్రమాదం కారణంగా దాదాపుగా మూడు నుంచి నాలుగు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది

ప్రమాదం జరిగిన గంట పావు వరకు కూడా ఫైరింజన్లు రాకపోవటం దారుణం. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేయాలి. సరైన సమయానికి ఫైరింజన్లు వచ్చి ఉంటే ఆస్తి నష్టం చాలా వరకు తగ్గేది..

ప్రమాదం జరిగిన షాప్ వాళ్లందరికీ నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలి..