మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న’ దక్కడం పట్ల భారాస అధినేత కేసీఆర్‌ హర్షం..

హైదరాబాద్: తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం ‘భారతరత్న’ దక్కడం పట్ల భారాస అధినేత కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పీవీకి ‘భారతరత్న’ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీకి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారాస ప్రభుత్వం ఘనంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించింది. ఆయనకు భారతరత్న ప్రకటించాలని పార్టీ తరఫున కోరాం. పీవీకి ఈ అత్యున్నత పురస్కారం రావడం యావత్‌ తెలంగాణకు గర్వకారణం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.