50 నిమిషాల పాటు కొనసాగిన కేసీఆర్ విచారణ..
కాళేశ్వరం కమిషన్' క్రాస్ ఎగ్జామినేషన్..! ముగిసిన కేసీఆర్ విచారణ.
*🔹కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన కేసీఆర్ విచారణ*
50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ
కేసీఆర్‌ను ప్రశ్నించిన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కమిషన్ ప్రశ్నలు
కమిషన్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కేసీఆర్
ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదన్న కమిషన్
రీఇంజినీరింగ్ గురించి వివరించిన కేసీఆర్
కేబినెట్ ఆమోదం ఉందా అని అడిగిన కమిషన్
కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే నిర్మించామన్న కేసీఆర్
అన్ని అనుమతులు తీసుకున్నామన్న కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పుస్తకాన్ని..
కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్‌కు అందించిన కేసీఆర్..
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై మాజీ సీఎం కేసీఆర్‌ను 50 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. మాజీ ముఖ్యమంత్రికి 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారించింది. జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని, అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని మాజీ సీఎం కోరారు. కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పీసీ ఘోష్ మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్‌ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ నివేదికను కమిషన్‌కు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నివేదికను కూడా కేసీఆర్ అందించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కమిషన్ పరిశీలించింది. విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు, ఆర్థికపర అంశాలపై మాజీమంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈ నెల 5నే కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్నా ఆరోగ్య కారణాల రీత్యా మరో తేదీ అడగడంతో విచారణ నేటికి వాయిదా వేశారు. ఇప్పుడు కేసీఆర్‌ను విచారించడంతో 115 మందిని విచారించినట్లు అయింది.
కేసీఆర్‌తో పాటు బీఆర్కే భవన్‌లోకి 9 మంది : విచారణ నిమిత్తం కేసీఆర్ గత కొన్నాళ్లుగా సంప్రదింపులు జరిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆయనతో పలుమార్లు సమావేశమయ్యారు. న్యాయవాదులు, విశ్రాంత ఇంజినీర్లతో చర్చించి అవసరమైన వివరాలు, సమాచారం, డాక్యుమెంట్లు సిద్ధం చేసుకున్నారు. ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ ఉదయం అక్కడినుంచి నేరుగా కమిషన్ కార్యాలయం బీఆర్కే భవన్ చేరుకున్నారు. కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేసీఆర్‌తో పాటు 9 మంది బీఆర్ఎస్ నేతలను మాత్రమే బీఆర్కే భవన్ లోపలికి అనుమతించిన, కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ సమయంలో అతని దగ్గర ఎవరూ లేరు..
కేసీఆర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ వన్ టు వన్ విధానంలో విచారణ జరిపారు. మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్‌ను జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరిగింది. ప్రాజెక్టు రీ డిజైనింగ్‌పై కమిషన్ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
మూడు బ్యారేజ్ లకు సంబంధించిన రీడిజైన్ లపై కేసీఆర్‌ను ప్రశ్నలు అడగగా అన్నింటికీ అప్రూవల్స్ ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. వ్యాప్కోస్ నివేదిక ప్రకారం అక్కడ నీరు అందుబాటులో లేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు..