సూర్యాపేట జిల్లా,
కోదాడ.
నిందితుడి మృతికి కారణమైన కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం సస్పెండ్ చేసి చిలుకూరు ఎస్ ఐ సురేష్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వులు. జారీ చేశారు. చిలుకూరు కు చెందిన ఓ వ్యక్తి సీఎంఆర్ఎఫ్ చెక్కు డబ్బులు ఒక వ్యక్తి అకౌంట్లో పడాయని కేసు నమోదు చేసిన పోలీసులు కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ అరెస్టు చేసి విచారించారు. రాజేష్ ను కేసు నమోదు చేయకముందే విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసి అతని మృతికి కారణమయ్యారని తల్లిదండ్రులు ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించారు. దీంతో దిగివచ్చిన పోలీసులు అతని కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 8 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామని పోలీసులు బేర సారాలు చేసి కేసును సర్దుమనిగించారు. ఈ విషయంపై ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పలువురు ఉన్నతాధికారులకు కలిసి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో కోదాడ రూరల్ సీఐ ని సస్పెండ్ చేస్తూ చిలుకూరు ఎస్సైని సూర్యాపేటలో అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా మృతుని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటం ఫలించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చిలుకూరు పోలీసులు ఈనెల 9న రాజేష్ను అరెస్ట్ చేసి 10న రిమాండ్ విధించడంతో హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించారు. 14వ తేదీ రాత్రి రాజేష్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిలుకూరు పోలీసులను ఎస్కార్ట్ ఇచ్చి హైదరాబాద్ లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 16న రాజేష్ మృతిచెందాడు. 17న పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చిలుకూరు పోలీసులు కొట్టడం వల్లే రాజేష్ మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేసేది లేదని స్పష్టం చేశారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం కోదాడలోని కల్లుగడ్డ బజార్లో రాజేష్ ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా నిర్వహించారు. రాజేష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, మృతికి కారణమైన చిలుకూరు పోలీసులపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు..