కేరళలో దారుణమైన ఘటన వెలుగులోకి…బాలుడిపై 14 మంది అత్యాచారం.. నిందితుల్లో రాజకీయ నాయకుడు,, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు..!

పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడంలేదు. మరి కొంతమంది అయితే నోరులేనీ మూగజీవాల్ని సైతం అత్యాచారం చేస్తున్నారు. బాలుడిని కూడా అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అసలు సమాజం ఎటుపోతుందని చాలా మంది ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడికి ఓ గే డేటింగ్ యాప్ ద్వారా నిందితులు పరిచయమయ్యారు.తొలుత స్నేహం పేరుతో దగ్గరై, గత రెండేళ్లుగా అతడిపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వీళ్లంతా.. 25 నుంచి 51 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తొంది. వీరిలో.. ఒకరు పొలిటిషియన్, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్ బాల్ కోచ్ తో పాటు, ఒకరు రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల బాలుడి తల్లి ఇంట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తిని గమనించారు. ఆమెను చూడగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె తన కుమారుడిని నిలదీయగా, రెండేళ్లుగా తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి చెప్పడంతో ఆ తల్లి షాక్ అయ్యింది. వెంటనే ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..

బాధితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు గత రెండు రోజుల్లో పోక్సో కింద మొత్తంగా 14 మందిపై కేసుల్ని నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు కొంత మందిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేరళ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్లపై నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలను మరింత కఠినతరం చేయాలని పలు ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగాయి.