కేరళలో దీపక్ ఆత్మహత్యకు కారణమైన ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్..!

కేరళలో దీపక్ ఆత్మహత్యకు కారణమైన ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా అరెస్ట్

ఓ బస్సులో దీపక్ తనను అసభ్యకరంగా తాకాడు అని వీడియో తీసిన ఇన్‌ఫ్లుయెన్సర్ షింజితా ముస్తఫా

వీడియో వైరల్ అవ్వడంతో అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్న దీపక్

దీపక్ సూసైడ్ కేసును సీరియస్‌గా తీసుకున్న కేరళ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్

ఈ ఘటనపై విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని నార్త్ జోన్ డీజీపీకి ఆదేశాలు..

దీప‌క్ త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు అంటూ షింజితా ముస్త‌ఫా అనే సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స‌ర్ బ‌స్సులో ప్ర‌యాణిస్తూ వీడియో తీయ‌గా అది వైర‌ల్ అయింది. వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో తానేం త‌ప్పు చేయ‌లేద‌ని తీవ్ర‌మ‌న‌స్థాపానికి గురై దీప‌క్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. అయితే విచార‌ణ‌లో దీప‌క్ త‌ప్పేమీ లేద‌ని, అత‌డు మ‌హిళ‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని తేలింది. వీడియోలో కూడా ఎక్క‌డా షింజితాతో దీప‌క్ అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్టు క‌నిపించ‌లేదు..
ఈ ఘ‌ట‌న‌ను కేర‌ళ హ్యూమ‌న్ రైట్స్ క‌మిష‌న్ సీరియస్ గా తీసుకుని నార్త్ జోన్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా నిందితురాలిని ప‌ట్టుకుని విచారించి నివేదిక ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇక మొద‌ట నిందితురాలి ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌డంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు సైతం జారీ చేశారు. కానీ నేడు కేర‌ళ‌లోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన స‌మ‌యంలో షింజితా మ‌న‌సులో ఎలాంటి ప‌శ్చాతాపం క‌నిపించ‌లేదు. అరెస్ట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో ఆమెను క‌ఠినంగా శిక్షించాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు…