కేతావత్ చంద్రు మృతి బాధాకరం..దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సంతాపం

– కేతావత్ చంద్రు మృతి బాధాకరం..

– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సంతాపం

చింతపల్లి……….
బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్య నాయక్ సోదరుడు చింతపల్లి మండలం ప్రశాంతపురి తండాకు చెందిన కేతావత్ చంద్రు మృతి చెందడం బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.కేతావత్ చంద్రు మృతి పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి,కేతావత్ బిల్య నాయక్, చింతపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.