ఖైరతాబాద్ ఉప ఎన్నికపై ఈసీ కీలక ప్రకటన. ఎలక్షన్ పిటిషన్ పెండింగ్లో ఉన్నందున ఖైరతాబాద్కు ఉప ఎన్నిక నిర్వహించబోమని హైకోర్టుకు తెలిపిన ఈసీ…
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పట్లో ఉపఎన్నిక నోటిఫికేషన్ను జారీ చేయబోమని కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్పై కోర్టు తుది నిర్ణయం వెలువడే వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వబోమని ఈసీ అధికారికంగా ప్రకటించింది..