ఐపీఎల్లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదట్లో బాగానే ఆడినప్పటికి, చివరికి వచ్చేసరికి చేతులు ఎత్తేసింది. దీనితో రియాన్ పరాగ్ (95) పోరాడినప్ప టికీ రాజస్థాన్ రాయల్స్‌కు ఓటమి తప్పలేదు.
ఆండ్రీ రస్సెల్ మెరుపులు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్ (57*; 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంగ్క్రిష్ రఘువంశీ,44; 31 5 ఫోర్లు, రెహ్మనుల్లా గుర్బాజ్ (35; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌లు, అజింక్య రహానె 30; 24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు కూడా పరుగుల వరద పారించారు.
చివర్లో రింకు సింగ్ (19*; 6 బంతుల్లో అదరగొట్టాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యుధ్విర్ సింగ్, మహీశ్ తీక్షణ, రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ చెప్పున పడగొట్టారు.కేకేఆర్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ (11; 9 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)ను యుధ్విర్ సింగ్ ఔట్ చేశాడు.
తర్వాత వచ్చిన గుర్బాజ్, రహానెలు నిలకడగా ఆడారు. గుర్భాజ్‌ను తీక్షణ ఔట్ చేయడంతో 7.3 ఓవర్ 56 పరుగుల భాగస్వామ్యా నికి తెరపడింది. దీనితో రహానె, రఘువంశీ రిస్కీ షాట్ల జోలికి వెళ్లకుండా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చివరికి రహానెను పరాగ్ పెవిలియన్‌కు పంపాడు దీంతో 14 ఓవర్లకు కోల్‌కతా 111/3తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యే లా కనిపించింది.
కానీ ఇక్కడే ఆట కీలక మలుపు తిరిగింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రస్సెల్ ఒక్కసారిగా దూకుడు పెంచాడు. ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో వరుస గా 4, 6, 4 బాదేశాడు. ఆర్చర్ వేసిన తర్వాతి ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. తీక్షణ వేసిన 18వ ఓవర్లో రస్సెల్ హ్యాట్రిక్ సిక్స్‌లు కొట్టి అర్ధ శతకానికి చేరువయ్యాడు.
అయితే రఘువంశీని ఆర్చర్ వెనక్కి పంపగా, ఆ ఓవర్లోనే రస్సెల్ సిక్స్ బాది ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ 22 బంతుల్లో నమోదు చేశాడు. ఆకాశ్ వేసిన చివరి ఓవర్లో రింకు వరుసగా 4, 6, 6 కొట్టాడు…