కోల్ కత్తా చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్….పాయింట్లు పట్టికలో చివర్లో నిలిచిన SRH..!

కోల్ కత్తా చేతిలో చిత్తుగా ఓడిన హైదరాబాద్..

ఓటమిలో హ్యాట్రీక్ కొట్టిన హైదరాబాద్, రాణించలేకపోతున్న ఓపెనర్లు..

పాయింట్లు పట్టికలో చివర్లో నిలిచిన SRH..

హైదరాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో అద్భుత మైన విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పుడు హ్యాట్రిక్ ఓటములను పూర్తి చేసుకుంది, కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో నిన్న జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ను 80 పరుగుల తేడాతో ఓడించింది,

టాస్ గెలిచిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించు కున్న ఆశలు నెరవేరలేదు. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో మంచి ఆరంభం చేసి ఉండవచ్చు. కానీ చివరి ఓవర్లలో బౌలర్లు అంతగా రాణించలేదు. కెప్టెన్ కమిన్స్ స్వయంగా బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు.

కెప్టెన్ కమిన్స్ తన నిర్ణీత 4 ఓవర్ల స్పెల్‌లో 44 పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ జట్టు ఓటమికి కూడా ప్యాట్ కమిన్స్ కారణమయ్యాడు.

అసమర్థుడిగా నిలిచిన హర్షల్ పటేల్ హర్షల్ పటేల్ మంచి బౌలింగ్‌ చేయగల డు. బ్యాటర్లు కూడా అత ను స్లోగా వేసిన బంతిని చూసి మోసపోతారు. కానీ ఈ మ్యాచ్ లో హర్షల్ పటేల్ అసమర్థుడిగా నిలిచాడు. సన్‌రైజర్స్ తరపున హర్షల్ పటేల్ ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ 4 ఓవర్లలో 43 పరుగులు కూడా ఇచ్చాడు.

*కొనసాగిన ఓపెనర్ల పరాజయం*

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద బలం ఓపెనింగ్ బ్యాటింగ్. ప్రపంచంలోని గొప్ప బౌలర్లు కూడా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల విధ్వంసకర బ్యాటింగ్ కు భయపడతా రు. కానీ లీగ్ లోని మొదటి మ్యాచ్ తప్ప ఈ ఇద్దరు ఆటగాళ్లు అప్పటి నుంచి వరుసగా మూడు మ్యాచ్‌లలో పరాజయం పాలయ్యారు. ఈ ఇద్దరూ బ్యాటింగ్‌లో బాగా రాణిం చకపోవడం సన్‌రైజర్స్‪ ఓటమికి కారణంగా మారింది.

సెంచరీ తర్వాత సైలెంట్ అయిపోయిన ఇషాన్ కిషన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించిన ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యాడు.

ఇషాన్ కిషన్ రాజస్థాన్ రాయల్స్‌పై సెంచరీ చేశాడు. కానీ అప్పటి నుంచి ఇషాన్ కిషన్ బ్యాట్ నుంచి పరుగులు ఏమీ రా లేదు. సన్‌రైజర్స్ ఓటమిలో ఇషాన్ కిషన్ అతిపెద్ద కారకుడు అయ్యాడు.

పాయింట్ పట్టికలో చివర్లో నిలిచిన SRH…