కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దు…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దు…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

HCU భూములు కొన్ని అనవసరంగా ఇబ్బందుల పాలుకావద్దు. ఇది నా విజ్ఞప్తి. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని మాన్‌హట్టన్‌ సెంట్రల్‌పార్క్‌ తరహాలో విశాలమైన ఎకో పార్క్‌గా అభివృద్ధి చేస్తాం. ఇది బీఆర్‌ఎస్‌ పార్టీ నిర్ణయం. మూడేండ్ల తరువాత జరిగేది ఇదే’

ముఖ్యమంత్రి తాను ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమేనని, ఓనర్‌ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలే ఓనర్లు. సీఎం భూమిని వస్తువుగా మాత్రమే చూస్తూ తెగనమ్మేందుకు ఆరాటపడుతున్నారు.

రేవంత్‌రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పుకుంటున్నారు. కానీ, మనిషిలాగా ఓ పది, పదిహేను నిమిషాలు ఆలోచించు. తాతలాగా, తండ్రిలాగా భవిష్యత్తు తరాల కోసం పనిచెయ్‌. అంతేగానీ, రియల్‌ఎస్టేట్‌ బ్రోకర్‌లా భూములను అమ్మకానికి పెట్టవద్దు. సీఎంకు, మంత్రులకు ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడింది. ప్రజలను బానిసల్లా చూస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారికి ఆస్తులు పెంచుకోవడంపై ఉన్న ధ్యాస ప్రజల బాగోగులపై లేదు.

రాహుల్‌గాంధీకి విద్యార్థులపై, హైదరాబాద్‌ ప్రజలపై ప్రేమ ఉంటే హెచ్‌సీయూకి రావాలి. రాహుల్‌ దేశవ్యాప్తంగా తిరుగుతూ మొహబ్బత్‌ కీ దుకాణ్‌ అని మాట్లాడుతున్నారు. కానీ, ఇక్కడ రేవంత్‌ మాత్రం విద్వేష దుకాణం తెరిచారు.