మా కూతురు అనుకునేది నాకు తెలియదు…కొండ దంపతులు..

మా కూతురు అనుకునేది నాకు తెలియదు.

పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు‌ సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్‌ చేసుకున్న కొండా సుస్మితా వ్యవహారంపై స్పందించిన కొండా దంపతులు

ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి.. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది

మా కూతురు తొందర పడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకు తెలియదు – కొండా మురళి

కొండా మురళీ, సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు

తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకి ఉంది

తన ఆలోచన ను మేము కాదనలేం..

పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం

కోరిక ఉండటంలో ఎలాంటి తప్పు లేదు – మంత్రి కొండా సురేఖ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం నా లక్ష్యం’అని కాంగ్రెస్ నేత కొండా మురళీ అన్నారు. ‘పని చేసే వాళ్లపైనే రాళ్ళు విసురుతారు.. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ గెలిచేలా.. ఎమ్మెల్యేలను మళ్ళీ వరంగల్ లో గెలిపించడం నా బాధ్యత.. నేను ఎవ్వడికి భయపడేది లేదు’అని కొండా మురళి హెచ్చరించారు. కొండా మురళి తన సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో కొండా మురళిపై ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళీ గురువారం కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌తో భేటి అయ్యారు. తన వ్యాఖ్యలపై ఇన్‌చార్జికి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ దంపతులు ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కి 16 పేజీల లేఖ సమర్పించారు.

నేను ఎవరికీ భయపడను: కొండా మురళి
‘నేను బీసీ కార్డు పైనే బ్రతుకుతున్నాను. రోజు 500 మంది ప్రజలకు భోజనం పెడతాను. ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందు ఉంటాను కాబట్టి ప్రజలు వస్తున్నారు. ఎలాంటి గ్రూప్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు’అని కొండా మురళి స్పష్టం చేశారు. ‘రేపు జరగబోయే మీటింగ్ పై చర్చించాం.. రేపు వరంగల్ నుంచి సభకు ఎంత మంది వస్తారు అనే దానిపై చర్చించాం.’అని కొండా మురళి వెల్లడించారు. మరోవైపు తన కుమార్తె సుష్మిత ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదు అని వివరణ ఇచ్చారు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది.. మా కూతురు అనుకునేది నాకు తెలియదు.. మా కూతురు తొందర పడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకు తెలియదు’అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. మరోవైపు లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. ‘నేను వెనకబడిన వర్గాల ప్రతినిధిని.. నలభై నాలుగు ఏండ్ల నుంచి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది.. ఒకరి గురించి నేను కామెంట్ చేయను.. నాకు ప్రజాబలం ఉంది. నేను ఎవరికీ భయపడను. పోటా, టడా కేసులకే నేను భయపడలేదు. నాకు భయం లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను’అని కొండా మురళి అన్నారు..