కౌటాల: ప్రాణహిత నదిలో వరద ప్రవాహం.. మునిగిన పుష్కర ఘాట్లు..

భారీ వర్షాలకు కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామ సరిహద్దులో గల ప్రాణహిత నదిలో వరద నీరు నిండుకుండను తలపిస్తోంది. ప్రాణహిత నదిలోకి మహారాష్ట్ర నుంచి పెనుగంగా, వార్ధా నదులలో భారీగా వరద నీరు చేరడంతో ప్రాణహితలో వరద ప్రవాహం పెరిగింది. గురువారం ప్రాణహిత నది ఒడ్డున గల పుష్కర ఘాట్లకు సమాంతరంగా వరద నీరు చేరాయి.