ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన విషాదంపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..

అదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆసుపత్రిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరం. ఈ దుర్ఘటనలో ఇంకా 23 మంది పసిపిల్లలు గాయపడిన నేపథ్యంలో వెంటనే మెరుగైన చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడాలి అని కాంగ్రెస్ సర్కార్ ఘోర వైఫల్యం వల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగి, అభంశుభం తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోయారు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసిన సీఎం రేవంత్ రెడ్డే ఈ సంఘటనకు పూర్తి బాధ్యత వహించాలి. రిమ్స్ ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితులపై అనేకసార్లు బీఆర్ఎస్ జిల్లా నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించినా.. మొద్దునిద్రపోయిన రేవంత్ సర్కారులో కనీస చలనం కనిపించలేదు అని అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన పిల్లల వార్డులో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా లోపించడం, కనీస నిర్వహణ లేకపోవడం వల్లే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పిల్లల వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అన్నారు రేవంత్ సర్కారు చేతకానితనం వల్ల తమ పసిపిల్లలను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.