స్పీకర్‌ వ్యాఖ్యలపై ఫైర్ అయిన కేటీఆర్..

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్ లో వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణలో అప్పులపై స్పీకర్‌ అబద్దాలు ఆడటంపై ఫైర్ అయ్యారు. స్పీకర్ మీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గడ్డం ప్రసాద్ గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి.. కేసీఆర్ మొత్తం అప్పులు చేసి పోయాడు.. మాకు ప్రభుత్వం నడుపొస్తలేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు..దయచేసి నేను వికారాబాద్‌ వేదికగా అడుగుతున్నా.
స్పీకర్ మీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ నోటి నుంచి ఇలాంటి సత్యదూరమైన మాటలు, అబద్దాలు, అసత్యాలు, అర్థసత్యాలు మీ గౌరవాన్ని తగ్గిస్తయి తప్ప పెంచయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి అబద్ధాలు ఆడితే మీ గౌరవం తగ్గుతుంది తప్ప పెరగదని కేటీఆర్ హితవు పలికారు..

రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి స్పీకర్ అలా మాట్లాడటం తగదు.

కేసీఆర్ అప్పులు చేసి పోయాడంటూ శాసనసభ స్పీకర్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో స్పీకర్ ఉన్న ఇలాంటి రాజకీయ మాటలు మాట్లాడితే ఆయన గౌరవం తగ్గుతుందే తప్ప పెరగదని హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వమే లెక్కలతో సహా బయటపెట్టిందని గుర్తుచేశారు. కేసీఆర్ అప్పులు చేశా.. వాటి ద్వారా ప్రజలకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, పెరిగిన పింఛన్లు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అనేక సంక్షేమ ఫలాలను అందించిన మొనగాడు కేసీఆర్ అని కొనియాడారు. చీకట్లో ఉన్న తెలంగాణను కేసీఆర్ వెలుగులోకి తెస్తే.. ఇప్పుడు మళ్లీ కరెంట్ కోతలు, యూరియా కొరత మొదలైందని..

మీరేమో శాసనసభలో స్పీకర్‌గా ఉన్నరు.. RBI, CAG వద్ద నుండి లెక్కలు తీసుకొని మీలాగే అనుమానమొచ్చి తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పు ఎంత..? అని నిండు పార్లమెంట్‌లో ఒక బీజేపీ ఎంపీ అడిగిండు. 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం నెత్తిమీదున్న అప్పు 72 వేల కోట్లు.. కేసీఆర్‌ దిగిపోయిన్నాడు డిసెంబర్ 03, 2023 నాడు తెలంగాణపై ఉన్న అప్పుడు 3 లక్షల 52 వేల కోట్లు.. అంటే కేసీఆర్ 10 ఏండ్లలో చేసిన అప్పు రూ.2.80 వేల కోట్లని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది.. అంటే సంవత్సరానికి సగటున 28 వేల కోట్లు కానీ స్పీకర్ రూ.8 లక్షల కోట్ల అప్పు చేశారని చెబుతున్నాడు, డిప్యూటీ సీఎం రూ. 9 లక్షల కోట్లు అంటాడు.. ఇంకొకైన 10 లక్షలు అంటడు.. నోటికి ఎంత వస్తే అంత చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.