గోడల మీద పెయింట్ వేసుకునే నీకు జూబ్లీహిల్స్లో ప్యాలెస్ ఉండొచ్చు కానీ.. కేసీఆర్ కి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండొద్దా…కేటీఆర్.
నువ్వు ఏమీ చేసి సంపాదించావు రేవంత్ రెడ్డి?
రేవంత్ రెడ్డి 7 ఏండ్లు డిగ్రీ చదివిండు..
రేవంత్ రెడ్డి సిరిసిల్లలో మా వాళ్లు 8000 ఎకరాలు కబ్జా చేశారని చిల్లర వ్యాఖ్యలు చేశాడు
కొండూరు రవీందర్ రావు టెస్కాబ్ మాజీ అధ్యక్షుడు 2014 తర్వాత తాను ఒక్క గజం భూమి కూడా కొనలేదు, తీసుకున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నాడు
జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ నక్సలైట్.. ఆయన లొంగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు మూడున్నర ఎకరాల భూమి ఇస్తే దాన్ని రేవంత్ రెడ్డి గుంజుకున్నాడు
భూపాలపల్లిలో 106 ఎకరాల భూమిని సుప్రీంకోర్టుకు వెళ్లి కాపాడి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఈకో పార్క్ పెట్టినం
రేవంత్ రెడ్డి సిరిసిల్లలో 8000 ఎకరాలు కబ్జా అని చిల్లర మాటలు మాట్లాడటం కాదు.. పూర్తి ఆధారాలతో బయటపెట్టు.. కేటీఆర్..
అంతేకాకుండా కొండల్ రావు అని కూకట్పల్లిలో ఒక పెద్దాయన ఉంటే ఆయన ఆస్తులు కూడా మా దాంట్లో రేవంత్ రెడ్డి వేసేశాడు.ఆయనకి మాకు చుట్టరికం కూడా లేదు.. కేవలం వెలమ కులం అంతే..కేసీఆర్ అక్కాచెల్లెలు, అన్నతమ్ముళ్ల సంతానం 300 మంది ఉంటారు వాళ్ల ఆస్తులు కూడా మా ఖాతాలో వేయి..నవీన్ రావుకి, కొండల్ రావుకి మాకు ఏం సంబంధం.. బుద్ధి జ్ఞానం ఉందా అసలు..సంతోష్ రావుకి మాకు చుట్టరికం ఉంటే ఆయన ఆస్తులు కూడా కేసీఆర్ ఖాతాలో వేస్తావా?..నీ అన్నతమ్ముళ్ల వాళ్ల పిల్లల ఆస్తులు నీ ఖాతాలో వేస్తే ఎలా ఉంటుంది?.నేను అమెరికాలో ఆరున్నర సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించుకున్నాను
గోడల మీద పెయింట్ వేసుకునే నీ సంగతి నాకు తెలియదా..
కొండారెడ్డిపల్లి పోయి అడిగితే మీ బతుకు మొత్తం బయటపడుతుంది…
కేసీఆర్ గారు పుట్టినప్పుడే ఆయన ఇల్లు రెండు ఎకరాలు, ఆయన తండ్రికి వందల ఎకరాల భూమి ఉండేది..
రైతు కుటుంబం కాబట్టి, వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఈనాటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు..
ఆరోజుల్లోనే చింతమడకలో రెండెకరాల ఇళ్లు ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారు..
కేసీఆర్ కి మొదటినుండే వందల ఎకరాలు ఉన్నాయి..
కేసీఆర్ దొర అంటావా, లేక ఈ మధ్య సంపాదించుకున్నాడు అంటావా ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు రేవంత్ రెడ్డి..వ్యవసాయం చేసుకుంటామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. నీలాగా మంది కొంపలు ముంచే పని చేయలేదు. ఆస్తులు గుంజుకోలేదన్నారు. కేసీఆర్ రైతు కాబట్టి బరాబర్ అన్ని చట్టాల ప్రకారం భూమి కొనుక్కున్నాడు. వ్యవసాయం చేశాడన్నారు. కేసీఆర్ భూమిని దేవతలాగా కొలుస్తాడు.. నీ లెక్క మంది కొంపలు ముంచి భూమిని ఆటవస్తువుగా చూడడని పేర్కొన్నాడు. ముఖ్యమంత్రిని సూటిగా ఒక్కటే అగుతున్నా… నీ కంపు నోటితో కేసీఆర్కు 1000 ఎకరాల భూమి ఉందని తప్పుడు కూతలు కూసి, చిల్లర మాటలు మాట్లాడిన అదే నోటితో కేసీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..రేవంత్ రెడ్డి 7 ఏండ్లు డిగ్రీ చదివిండు అని ఎద్దేవా చేశారు. కొండల్ రావు అని కూకట్పల్లిలో ఒక పెద్దాయన ఉంటే ఆయన ఆస్తులు కూడా మా దాంట్లో రేవంత్ రెడ్డి వేసేశాడు. ఆయనకి మాకు చుట్టరికం కూడా లేదు.. కేవలం వెలమ కులం అంతే. కేసీఆర్ అక్కాచెల్లెలు, అన్నతమ్ముళ్ల సంతానం 300 మంది ఉంటారు. వాళ్ల ఆస్తులు కూడా మా ఖాతాలో కలిపెయ్.సంతోష్ రావుకి మాకు చుట్టరికం ఉంటే ఆయన ఆస్తులు కూడా కేసీఆర్ ఖాతాలో వేస్తావా? నీ అన్నతమ్ముళ్ల వాళ్ల పిల్లల ఆస్తులు నీ ఖాతాలో వేస్తే ఎలా ఉంటుంది? అని నిలదీశారు. నవీన్ రావుకి, కొండల్ రావుకి మాకు ఏం సంబంధం? నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు..
గోడల మీద పెయింట్ వేసుకునే నీకు జూబ్లీహిల్స్లో ప్యాలెస్ ఉండొచ్చు కానీ.. కేసీఆర్ కి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఉండొద్దా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ..