రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula-E car race case) అంశంలో ఏసీబీ (ACB) నమోదు చేసిన కేసులో తొలిరోజు కేటీఆర్ విచారణ ముగిసింది…ఎఫ్ఈఓతో ఒప్పందాలు, చెల్లింపుల విషయంలో కేటీఆర్‌ను ఆరా తీసినట్లు తెలుస్తోంది. రెండు సెషన్స్‌లో జరిగిన విచారణలో సుమారు 7 గంటల పాటు 40 ప్రశ్నలు వేసిట్లు సమాచారం. ఉదయం మొదలైన విచారణ మధ్యాహ్నం 1:30 గంటలకు విచారణ అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అనంతరం తిరిగి ప్రశ్నించారు. రేస్‌కు ముందు జరిగిన అగ్రిమెంట్లు, రేస్ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై పలు కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిసింది. హైకోర్టు అనుమతితో ఈ విచారణను దూరం నుంచి చూసేందుకు కేటీఆర్ లాయర్‌కు అధికారులు అనుమతి ఇచ్చారు. అనంతరం విచారణ ముగియడంతో ఆయన్ను ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయేందుకు అనుమతి ఇచ్చారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని అధికారులు కేటీఆర్‌కు సూచించారు.
కేటీఆర్ డీసీపీల మధ్య వాగ్వాదం:
విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం సమీపంలో మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ (DCP) విజయకుమార్ కేటీఆర్ ను వారించారు. దీంతో మీడియాతో మాట్లాడితే భయమెందుకని డీసీపీని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక్కడ మీడియాతో మాట్లాడవద్దని ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని కేటీఆర్ కు చెప్పారు. దీంతో ఎక్కడ మాట్లాడాలని కేటీఆర్ అధికారిని అడగగా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టుకోవాలని డీసీపీ సూచించారు. పోలీసుల సూచనతో అక్కడి నుంచి వెళ్లిపోయిన కేటీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి మీడియాతో మరోసారి మాట్లాడారు…