తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు
ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..
ప్రజలు రేవంత్ రెడ్డిని తిడుతుంటే తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంటూ రేవంత్ రెడ్డి చేసిన మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో మోసపోయిన ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాల వలన అన్యాయానికి గురవుతున్న వర్గాలు ప్రభుత్వాన్ని నిందిస్తుంటే తనకు సంతోషం కలుగుతుందంటూ రేవంత్ రెడ్డి సంబరపడుతున్నాడని కేటీఆర్ అన్నారు.
ప్రజల పక్షాన ప్రభుత్వానికి సమస్యలు తెలియజేస్తుంటే రేవంత్ రెడ్డి తనకు పైశాచిక ఆనందం వస్తుందని ప్రతిపక్షాల గురించి మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు.
రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది చనిపోయినా రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదన్నారు.
కనీసం కోతలు లేకుండా కరెంట్ ఇవ్వలేకపోతున్నందుకు, రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయలేకపోతున్నందుకు సిగ్గు అనిపిస్తుందా లేదా? అని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
రైతుల ధాన్యం రోడ్ల మీద తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ కూడా అనిపిస్తుందా లేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇలా అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతుంటే.. వారి బాధలను చూసి ప్రభుత్వాన్ని మేము తిడితే, ప్రతిపక్షాల తిట్లతో తనకు శాడిస్టిక్ ప్లెజర్ వస్తుందని.. పైశాచిక ఆనందం పొందుతున్నానని బాహాటంగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని ఏమనాలని ప్రశ్నించారు.
ఇంత నిస్సిగ్గుగా పైశాచిక ఆనందం పొందుతున్న ముఖ్యమంత్రిని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
ప్రతిసారి “నేను మారిన మనిషిని” అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి యథావిధిగా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వసూలు చేసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది.
విద్యార్థులు పరీక్షలకు, చదువులకు దూరమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు అనిపించడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా పంటల కొనుగోలు దాదాపు పూర్తిగా నిలిచిపోయింది.
ధాన్యం, మొక్కజొన్న, జొన్నల కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరవడం లేదు.
ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు కేటాయించడం లేదు.
ధాన్యం సేకరిస్తే బోనస్ ఇవ్వాల్సి వస్తుందని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
రైతుల ధాన్యం రోడ్ల మీద వానలకు తడిసి పోతుంటే రేవంత్ రెడ్డికి సిగ్గు అనిపించడం లేదు.