బండి సంజయ్ యాత్రలో తేనటీగల దాడి. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రలో తేనటీగల దాడి. ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో ఘటన..
తెలంగాణలో గ్యాస్ కొరత లేదు. కమర్షియల్ గ్యాస్ కొరత మాత్రమే ఉంది. LPG కొరత లేకుండా చూసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాం. LPG సరఫరాపై ఆయిల్ సంస్థలతో ఇవాళ రివ్యూ చేశాం. -మంత్రి ఉత్తమ్..
మూసీ మురికి కూపంగా మారింది కాంగ్రెస్ హయాంలోనే..కేటీఆర్
మూసీ మురికి కూపంగా మారింది కాంగ్రెస్ హయాంలోనే.. ముందు ఆ పాపాన్ని కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ చెంపలేసుకుని క్షమాపణలు చెప్పాలి.
మూసీ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు ఆగమవుతున్నాయి. మూసీని ప్రక్షాళణ చేసేందుకు బీఆర్ఎస్ మంచి ప్రణాళికలు సిద్ధం చేసింది. మంచి రేవుల నుంచి ఘట్కేసర్ వరకు 57కి.మీ. పరిధిలో మూసీ రూపం మార్చాలనుకున్నాం. మూసీపై 15 బ్రిడ్జ్‌లు నిర్మించాలని ప్లాన్ చేశాం. -కేటీఆర్.
హైదరాబాద్‌లో గ్యాస్ ఇంపాక్ట్
భారీగా పెరిగిన బాస్మతి, చికెన్, మటన్ ధరలు
కట్టెల పొయ్యి బిర్యానీ రుచి కారణంగా..
హోటళ్లలో ఊపందుకున్న బిర్యానీ విక్రయాలు
కస్టమర్ల తాకిడి భారీగా పెరిగిందంటున్న నిర్వాహకులు
బిర్యానీ కోసం గంటల తరబడి నగర వాసుల క్యూ
సమస్యను పరిష్కరించాలంటున్న హోటళ్ల యజమానులు
ప్రత్యేక కోటాలో గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్
సమయానికి ఆహారం అందించలేకపోతున్నామని ఆవేదన..
హర్మూజ్ జలసంధి మూసివేతపై ట్రంప్ పోస్ట్
ఇరాన్ సైనిక స్థావరాలను 100% దెబ్బతీశాం-ట్రంప్
యుద్ధంతో నష్టపోతున్న దేశాలు యుద్ధనౌకలు పంపుతున్నాయి..
ఇరాన్ తీరం అంతటా US బాంబుల మోత మోగిస్తాం..వారి నౌకలు, బోట్లను పూర్తిగా ధ్వంసం చేస్తాం-ట్రంప్..
హర్మూజ్ జలసంధిని సురక్షితమార్గంగా మారుస్తాం-ట్రంప్
UAE పౌరులకు ఇరాన్ సైన్యం హెచ్చరిక.
UAEలోని అమెరికన్ స్థావరాల దగ్గరకు వెళ్లొద్దు
అమెరికన్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తాం-ఇరాన్
హెచ్చరిక జారీ చేసిన ఇరాన్ సైనికాధికారి..
అమరావతి: పలువురు మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులతో చర్చించిన సీఎం.. కేంద్రంతో సమన్వయం చేసుకొని గ్యాస్ కొరత లేకుండా చూడాలని సీఎం సూచన
బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. జపాన్ సముద్రంపైకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా… ఉత్తర కొరియా 10 క్షిపణులను ప్రయోగించినట్లుగా జపాన్ ప్రకటన
పాక్‌పై డ్రోన్లతో విరుచుకుపడ్డ తాలిబన్లు.. .
పాక్‌లోని జన నివాస ప్రాంతాలపై తాలిబన్ల డ్రోన్ల దాడులు.. తాలిబన్ల దాడులను ఖండించిన పాక్ మంత్రి.. జన నివాస ప్రాంతాలలో దాడులు చేస్తే సహించం-పాక్ మంత్రి..
🔸ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ క్షిపణి దాడులు. నిమిషాల్లో 1400లకుపైగా మిస్సైళ్లతో దాడి. ఉత్తర, మధ్య, దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతాలపై దాడులు.
🔸ఇరాన్ మిలటరీ సామర్థ్యాలను 100% నాశనం చేశాం. చైనా, ఫ్రాన్స్, జపాన్, సౌత్ కొరియా, యూకే లాంటి దేశాలు నౌకలు పంపాలి. తల తెగిన ఇరాన్ లాంటి దేశంతో ముప్పు ఉండదని స్పష్టమవుతుంది. ఇరాన్ తీర ప్రాంతంపై అమెరికా దాడులు కొనసాగిస్తుంది. త్వరలోనే హార్ముజ్‌ను అమెరికా ఓపెన్ చేస్తుంది. హార్ముజ్‌ను సురక్షితంగా, స్వేచ్ఛగా ఉంచుతాం. -ట్రంప్
🔸మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం. సోదాలు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్‌హౌస్‌గా గుర్తింపు. డ్రగ్స్ తీసుకున్న ఎనిమిది మంది అరెస్ట్. కొకైన్‌తో పాటు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.