*తిరుమలలో దంపతుల ఆత్మహత్య..
తిరుమల: తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు (60), ఆయన భార్య అరుణ (55) తిరుమల శ్రీవారి దర్శానికి వచ్చారు. నందకం అతిథి గృహంలోని గది నెంబర్ 203ను అద్దెకు తీసుకున్నారు. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి కాటేజీలో ఆత్మహత్య చేసుకోవటం, అందులోనూ భార్యాభర్తలు ఇలా తిరుమలలో చనిపోవాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య సమాచారాన్ని తిరుపతిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. పిల్లలు, బంధువులు కొండకు వచ్చి పోలీస్ విచారణకు హాజరయ్యారు..
గత నాలుగు రోజులుగా యాదాద్రి జిల్లాలో అడవి దున్న హల్ చల్...మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కింద పడిపోయి మృతి ...
అడవిని వదిలి గ్రామీణ ప్రాంతాల్లోకి రావడంతో చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో గ్రామస్తులు మరియు అటవీ శాఖ అధికారులను చూసి అడవిదున్న భయానికి లోనై జిల్లాలోని పలి మండలాల్లోకి తిరుగుతూ భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా సమీపంలో మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కింద పడిపోయి మృతి చెందింది.
స్థానికులు మాత్రం అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహం కారణంగానే ఎక్కువ మోతాదులో రెండుసార్లు మత్తు ఇంజక్షన్ ఇవ్వడం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. మృతి చెందిన అడవిదున్నను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ కు తరలించారు ఫారెస్ట్ అధికారులు..
యాదాద్రి భువనగిరి జిల్లా:
మహిళా కండక్టర్ పుస్తెలతాడు కొట్టేసిన దొంగలు..
జనగాం నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో కండక్టర్ మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసుని కొట్టేసిన కేటుగాళ్లు..
ఆలేరు పోలీసులకు ఫిర్యాదు చేసిన బస్ కండక్టర్ బస్సులో ఉన్న వారందరినీ తనిఖీలు చేసిన పోలీసులు. దొరకని బంగారు గొలుసు..
TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు కొలిక్కి
TG: TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు తుదిదశకు చేరింది. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశముంది. కార్యవర్గంలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి చామల, రోహిణ్, రాజేందర్.. SCల నుంచి సంపత్, కవ్వంపల్లి, ప్రీతం.. STల నుంచి బలరాం, బెల్లయ్య, మురళి.. మైనారిటీల నుంచి ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది...
అరవింద్ కేజ్రీవాల్‌కు ACB నోటీసులు
ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ఢిల్లీలో హైడ్రామా
ఆపరేషన్ లోటస్ ఆరోపణలపై కేజ్రీవాల్‌కు ఏసీబీ నోటీసులు
ఏసీబీ అధికారులను ఇంట్లోకి అనుమతించని కేజ్రీవాల్ లీగల్ టీమ్
అధికారుల వద్ద సరైన పత్రాలు లేవంటూ అభ్యంతరం
కేజ్రీవాల్ ఇంటి ముందు చాలా సేపు ఎదురుచూసి చివరికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయిన ఏసీబీ అధికారులు..
PM Kisan Yojana: రైతులకు గుడ్‌న్యూస్, పీఎం కిసాన్ డబ్బులు త్వరలో విడుదల
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బులు ఈ నెలలోనే విడుదల అవుతాయి. 18వ విడత డబ్బులను ప్రధాని మోదీ 15 అక్టోబర్ 2024న విడుదల చేశారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈ నెల చివరి నాటికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24న బిహార్‌లో పర్యటించి, వ్యవసాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత, ప్రధాన మంత్రి కిసాన్ యోజన 19వ విడత డబ్బులను పంపిణీ చేస్తారు.
e-KYC ని తక్షణమే పూర్తి చేయండి
మీరు వ్యవసాయదారు అయితే, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద ప్రయోజనాలను పొందడానికి e-KYC అవసరం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, 15 అక్టోబర్ 2024న, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడతను విడుదల చేశారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన అంటే ఏమిటి?
ప్రధానమంత్రి కిసాన్ యోజన లేదా పీఎం కిసాన్ అనేది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. ఈ పథకం 100% నిధులను భారత ప్రభుత్వమే సమకూరుస్తుంది, రాష్ట్రాలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం ఉండదు. ఈ పథకం కింద, ఏడాదికి రూ. 6,000 మొత్తాన్ని నేరుగా లబ్ధిదారులైన రైతుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి, రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో మొత్తం రూ. 6,000 వార్షిక చెల్లింపు జరుగుతుంది. ఈ డబ్బు అర్హుడైన రైతు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. అయితే, ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ లింక్ అయి ఉండాలి.
e-KYC చేయడం ఎందుకు అవసరం?
దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ పథకం ప్రయోజనాలు చేరేలా & మధ్యవర్తుల ప్రమేయం ఉండకుండా eKYC చేయడం అవసరం. మోసం జరిగే అవకాశాన్ని ఇది తగ్గిస్తుంది.
e-KYC పద్ధతులు
PM కిసాన్ యోజన లబ్ధిదారులు eKYC పూర్తి చేసేందుకు మూడు పద్ధతులు ఉన్నాయి:
OTP ఆధారిత e-KYC (PM-KISAN పోర్టల్ & మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది)
బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ కామన్ సర్వీస్ సెంటర్లు (CSC) & స్టేట్ సర్వీస్ సెంటర్లలో (SSC) అందుబాటులో ఉంది.
ముఖ ప్రామాణీకరణ ఆధారిత ఈ-కేవైసీ (పీఎం కిసాన్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంది), దీనిని దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఉపయోగిస్తున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం ఎలా నమోదు చేసుకోవాలి?
ఈ పథకం కింద, అర్హులైన లబ్ధిదారులు ఆధార్ కార్డు, పౌరసత్వ ధృవీకరణ పత్రం, భూమి యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలతో e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికోసం:
పీఎం-కిసాన్ పోర్టల్‌లోకి వెళ్లి రిజిస్టర్ ఆన్‌లైన్‌పై క్లిక్ చేసి, అన్ని వివరాలు పూర్తి చేయండి.
మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)కు వెళ్లి కూడా ఈ పని పూర్తి చేయవచ్చు.
మీ రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారులను సంప్రదించండి.
స్థానిక రెవెన్యూ అధికారిని సంప్రదించండి.
గాంధీ భవన్ లో..చేతులు, కాళ్లకు బేడీలతో కాంగ్రెస్ నేతలు
అమెరికా లో భారతీయులను అక్రమ వలసదారులుగా పేర్కొంటూ ట్రంప్ ప్రభుత్వం అమనవీయంగా, అవమాన కరం గా కాళ్ల కు, చేతులకు బేడీలు వేసి ఇండియా పంపిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీస్కొకపోవడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఫిరోజ్ ఖాన్ నేతృత్వంలో గాంధీ భవన్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావ్, టీపీసీసీ. సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావ్ తదితరులు పాల్గొన్నారు...
*లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ*
ముంబై: ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లను సవరించడంతో లోన్లు తీసుకున్న వారికి ఉపశమనం కలగనుంది. ఈ మేరకు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. వడ్డీ రేట్లు తగ్గడంతో దేశంలోని కోట్లాది మంది గృహ రుణ కొనుగోలుదారులకు భారీ ఊరట లభించనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు.
సామాన్య ప్రజలకు ఊరట..
రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు. 6.50 శాతం ఉన్న రెపో రేటును 6.25 శాతానికి తగ్గించామన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. గడిచిన ఐదేళ్లలో తొలిసారి రెపో రేటును తగ్గించడంతో సామాన్య ప్రజలకు ఊరట కలిగింది. మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది.
రెపో రేట్ల తగ్గింంపుపై సమర్థన.
లోన్లపై ఈఎంఐ తగ్గించాలనే డిమాండ్ ఎంతోకాలంగా ఉంది. ఆర్బీఐ ఎంపీసీపై కూడా చాలా ఒత్తిడి ఉంది. గత కొన్ని సమావేశాల్లో ఎంపీసీలోని కొందరు సభ్యులు రెపో రేట్ల తగ్గింపును సమర్థించారు. కానీ ఎక్కువ మంది సభ్యులు మాత్రం రెపో రేటును మార్చకుండా అలాగే ఉంచాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్బీఐపై ఒత్తిడి పెంచింది. అయితే సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెపో రేటులో సవరణలు చేస్తారని చాలామంది భావించినట్లుగానే ఈ నిర్ణయం తీసుకున్నారు..
*ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించిన సర్కార్*
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని, ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు చర్చలకు హాజరుకావాలని ఆహ్వానించింది. ఈ సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం మరియు ఆర్టీసీ జేఏసీ (RTC JAC)ని ఆహ్వానించినట్లు కార్మిక శాఖ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.
ఇప్పటికే టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ గత నెల 27న సమ్మె నోటీసు ఇచ్చింది. 21 డిమాండ్లు నెరవేర్చకపోతే, ఫిబ్రవరి 9న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మె చేపడతామని ప్రకటించింది. బస్ భవన్లో జరిగిన సమావేశంలో ఆపరేషన్స్ ఈడీకి సమ్మె నోటీసు అందజేశారు.
కార్మికులు ప్రభుత్వానికి ముందుచేసిన ముఖ్యమైన డిమాండుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండు పీఆర్సీల అమలు, 2021 వేతన సవరణ, మరియు సర్కారు ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించడం ఉన్నాయి. అలాగే, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి నడపాలి అనే డిమాండ్ కూడా ఈ జాబితాలో ఉంది.
ఈ సమస్యల పరిష్కారానికి చర్చలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. కార్మికులు సమ్మెకు దిగకుండా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్చలే సరైన మార్గమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. చర్చల ఫలితాన్ని బట్టి ఆర్టీసీ సమ్మె ఉంటుందా? లేదా? అనేది తేలనుంది. కార్మికులు, ప్రయాణికులు అందరూ ఈ చర్చలపై దృష్టి పెట్టారు..
*కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.*
*విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు.*
*దక్షిణ కోస్తా పరిధిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు.*
*వాల్తేరు డివిజన్ పేరు విశాఖపట్నం డివిజన్‌గా మార్పు.*
*ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జోన్.*
*పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇచ్చినట్లు కేంద్రం వెల్లడి.*