లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

*తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముహూర్తం ఖరారు..*

డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

ఆర్ ఓ ఆర్ చట్టాన్ని ఆమోదించనున్న అసెంబ్లీ..

రైతు, కుల గణన సర్వే పై చర్చించే అవకాశం..

మహారాష్ట్ర ఫలితాల తరువాత మంత్రి వర్గ విస్తరణ..

డిసెంబర్ 7 తో రేవంత్ రెడ్డి సర్కార్ కు ఏడాది పూర్తి..

ఆ లోపే మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం..

పంచాయతీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం..

ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు..

కాగ్‌ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్‌మూర్తి ప్రమాణస్వీకారం.

దిల్లీ: ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి చేపట్టారు. కాగ్‌ (CAG) అధిపతిగా గురువారం ఆయన ప్రమాణస్వీకారం చేశారు..
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి (K Sanjay Murthy) అరుదైన ఘనత సాధించారు.

అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివారు. 1989లో ఐఏఎస్‌ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికై, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021 సెప్టెంబరు నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు.

ఐఏఎస్‌ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సిఉండగా, సంజయ్‌ సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. సంజయ్‌మూర్తి తండ్రి కేఎస్‌ఆర్‌ మూర్తి 1996లో కాంగ్రెస్‌ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు..

కర్నాటకలో ఘోర రోడ్డుప్రమాదం.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు

ఉడిపి జిల్లాలోని శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయంలోకి వెళ్లేందుకు NH-66పై రివర్స్‌ తీసుకుంటుండగా, అతివేగంతో వెళ్తున్న ట్రక్కు ఇన్నోవా కారును ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్‌తో సహా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

కేరళకు చెందిన ఏడుగురు ఇన్నోవా కారులో గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..

*_రామ్ గోపాల్ వర్మ పై మరో కేసు నమోదు_*

_*అనకాపల్లిలో రామ్ గోపాల్ వర్మపై మరో కేసు నమోదు చేసిన రావికమతం పోలీసులు*_

*_ఈరోజు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన పోలీసులు_*

*_ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలిపిన వర్మ_*

*_విచారణకు మరో వారం రోజుల సమయం కోరిన రామ్ గోపాల్ వర్మ..

వేలాది మంది పోలీసులు క‌వాతు ఎందుకో.. కేటిఆర్..

మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది పోలీసులు క‌వాతు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. రైతుల‌ను, ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురి చేసేలా పోలీసులు లాంగ్ మార్చ్ నిర్వ‌హించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు..శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది..? ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది..? ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన, కక్ష్యల పాలన, ఆంక్షల పాలన..
మొత్తంగా రాక్షస పాలన అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఖబర్దార్ రేవంత్.. ఇది తెలంగాణ. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుందని కేటీఆర్ హెచ్చ‌రించారు…

ఆర్కే రోజా జైలుకు పంపిస్తా..శాప్ ఛైర్మన్ రవినాయుడు

వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా ఆమెను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.

మద్యం నేడు అమృతంగా మారిందా?: రాచమల్లు..!

వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని వైసీపీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు..

తెలంగాణలో గ్రూప్ 2 (Group 2) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్..!

తెలంగాణలో గ్రూప్ 2 (Group 2) అభ్యర్థులకు బిగ్ అలర్ట్. డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ (TGPSC) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పరీక్షల షెడ్యుల్‌ను కమిషన్ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 4 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుండగా.. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పేపర్ 1, 3 పరీక్షలు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పేపర్ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

ప్రధాని మోదీకి డొమినికా, గయానా అత్యున్నత గౌరవ పురస్కారాలు..!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీర్తి కిరీటంలో మరో రెండు కలికితురాళ్లు చేరాయి. కామన్వెల్త్ ఆఫ్ డొమినికా, గయానా దేశాలు తమ దేశాల అత్యున్నత జాతీయ పురస్కారాలను ప్రధాని మోదీకి ప్రదానం చేశాయి. ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు నిలుపుకుంటూ, విపత్తు సమయంలో అందించిన సహాయానికి గుర్తుగా ఈ పురస్కారాలు ప్రధానికి లభించాయి.

డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్
డొమినికా ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారం ‘డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్’‌ను ప్రదానం చేసింది. డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును ప్రధానికి అందజేశారు. ఈ పురస్కారాన్ని భారత జాతికి అంకితం ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు.

గయానా నుంచి ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’
అదేవిధంగా, గయానా దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ అనే వారి అత్యున్నత పురస్కారాన్ని ప్రధానికి అందజేశారు. భారత్ గ్లోబల్ సహకారానికి అందిస్తున్న తోడ్పాటు, నాయకత్వ నైపుణ్యాలకు ఇది గుర్తింపు…

కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చిన పార్టి శ్రేణులు..! .

తేలంగాణాలో అధికార పార్టీ కాంగ్రెస్ కు సొంత పార్టీ శ్రేణులే భారీ షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండామోస్తు వచ్చిన తమను కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికీ పదవులు ఇవ్వడం పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుక్కారు..గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో సీనియర్‌ కార్యకర్తలు ఉన్నా.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన దుర్గం శ్యామలకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాదని ఇటీవల కాంగ్రెస్‌లోకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తమ ఆవేదనను పార్టీ పెద్దలు గుర్తించకపోతే హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఎదుట నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. బీర్కూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను తొలగించి.. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, జహీరాబాద్‌ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ ప్రతిపాదించిన ఒరిజినల్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తకు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు…

అదానీ ఒక అవినీతి పరుడయితే 100 కోట్ల విరాళం సిఎం రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకున్నారు.. బిజేపి జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా.

అదానీ ఒక అవినీతిపరుడని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పదేపదే ఆరోపిస్తుంటారని, అదే నిజమైతే, అదానీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)రూ.100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారని బీజేపీ ( BJP)జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా(Sambit Patra)ప్రశ్నించారు..
దావోస్‌లో రూ.12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారని నిలదీశారు. ఆ సంస్థతో 12,400 కోట్ల రూపాయల ఒప్పందాలు ఎలా చేసుకున్నారని ప్రశ్నించారు. సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ నుంచి లంచాలు అందుకున్న రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయని బీజేపీ కౌంటర్ ఎటాక్ చేసింది. గౌతమ్ అదానీ అవినీతికి పాల్పడ్డారని, నరేంద్రమోడీతో చేతులు కలిపారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించిన నేపథ్యంలో.. ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర గురువారం మీడియా సమావేశంలో కౌంటర్ ఎటాక్ చేశారు.

అదానీ గ్రూప్ పై అమెరికా అభియోగాలు మోపిన నాలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ సీఎం లేరని, ఆ సమయంలో ఛత్తీస్ గఢ్, తమిళనాడులో కాంగ్రెస్, దాని మిత్ర పక్షమే అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. 2021-2023 మధ్య రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు లంచాలుగా 265 మిలియన్ డాలర్లు చెల్లించిందని యూస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. యూఎస్ నేరారోపణ చేసిన రాష్ట్రాల్లో ఛత్తీస్ గఢ్, తమిళనాడుతో పాటు ఒడిశా నవీన్ పట్నాయక్ పాలనలో, ఏపీలో వైఎస్ జగన్ పాలనలో ఉన్నాయని నంబిత్ పాత్రా వెల్లడించారు. భారతదేశాన్ని రక్షించే నిర్మాణాలపై దాడి చేయడం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యూహమని ఆరోపించారు. రాహుల్ గాంధీ 2019లో ఇదే తరహాలో రాఫెల్ సమస్యని లేవనెత్తారని, కోవిడ్ సమయంలో వాక్సిన్ పనితీరుని ప్రశ్నించారని.. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టు ముందు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని సంబిత్ పాత్ర గుర్తు చేశారు.

కాగా అమెరికాలో బిలయన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో ఒక కేసు నమోదైంది. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని అమెరికా ఎఫ్ బీఐ అభియోగాలు మోపింది. అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం 250 మిలియన్ డాలర్లను లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదైయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను ఆదానీ గ్రూప్ ఖండించింది. దీనిపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ గౌతమ్ అదానీ అమెరికా, భాతర చట్టాలను ఉల్లంఘించారని పార్లమెంటరీ సంయుక్త కమిటీ(JPC) వేసి విచారించాలని, ఆదానీ, ప్రధానీ మోడీ బంధాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆదానీని మోడీనే కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ మధ్యే కాంగ్రెస్ పాలిత కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో అదానీ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి..దీనిపై కూడా విచారణ జరగాలా? అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ తప్పకుండా విచారణ జరగాలని..అదానీని అరెస్టు చేయాలి..ఇతరులు ఎవరున్నా వారిని కూడా అరెస్టు చేయాలని స్పష్టం చేశారు..

గౌతం అదానీకి అరెస్టు వారెంట్ జారీ..!

అదానీ గ్రూపు సంస్థ ఓనర్ గౌతం అదానీ
( Gautam Adani)కి.. అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. 265 మిలియన్ల డాలర్ల లంచం కేసులో న్యూయార్క్ కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది..20 ఏళ్లలో దాదాపు రెండు బిలియన్ల డాలర్ల లాభం వచ్చే సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సొంతం చేసుకునేందుకు భారతీయ ప్రభుత్వ అధికారులకు గౌతం అదానీతో పాటు మరో ఏడు మంది ముడుపులు ఇవ్వచూపినట్లు తేలింది. ఈ కేసులో గౌతం అదానీ బంధువు సాగర్ అదానీ కూడా ఉన్నారు. గౌతం, సాగర్ అదానీ అరెస్టు వారెంట్‌ను జడ్జి జారీ చేశారు. ప్రాసిక్యూటర్లు ఆ వారెంట్‌ను .. విదేశీ న్యాయశాఖకు అందజేయనున్నారు.

అమెరికా డాలర్ బాండ్ల ద్వారా సుమారు 600 మిలియన్ల డాలర్లు సమకూర్చాలని అదానీ గ్రీన్ ఎనర్జీ భావించింది. కానీ గురువారం ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అరెస్టు వారెంట్ జారీ నేపథ్యంలో.. అదానీ గ్రూపు ఆ ప్లాన్‌ను రద్దు చేసింది. అయితే దీనిపై అదానీ గ్రీన్ ఎనర్జీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికా పెట్టుబడీదారులను, అధికారులను మోసం చేసినట్లు గౌతం అదానీపై అభియోగాలు నమోదు అయ్యాయి. అమెరికాకు చెందిన సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమీషన్ ఆ అభియోగాలు చేసింది..

భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు

రంగారెడ్డి – అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు

దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి.. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానం.. సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా….

డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్

ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతున్నారు.. ఈ స్కీమ్ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు.

ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్‌కు పిలుపునిచ్చిన ఆటో సంఘాల JAC….

కొడంగల్ లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్...

రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి నోటీసులు ఇష్యూ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్…

నవంబర్ 11న ఫార్మా కంపెనీల ఏర్పాటు సంబంధించి భూసేకరణకు లగచర్ల సమీపంలో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సందర్భంగా కొందరు రైతులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో చర్చలు జరపాలని కలెక్టర్ ను కోరారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు. వారి వాహనాలను పెద్ద పెద్ద బండరాళ్లతో ధ్వంసం చేశారు. దీనిపై తెలంగాణ గవర్నమెంట్ వెంటనే చర్యలు చేపట్టింది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి..దాంతో పాటూ ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ రోజు ఆయన పోలీసుల ముందు లొంగిపోవడంతో అరెస్ట్ చేశారు. కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు సురేష్ ను హాజరుపరిచారు. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో సురేష్ A2గా ఉన్నాడు. కలెక్టర్ పై దాడికి గ్రామస్తులను రెచ్చగొట్టడంతో పాటు.. అధికారులను కావాలనే గ్రామంలోకి తీసుకెళ్లాడన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఘటన జరిగిన నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు.

ఇప్పుడు ఈ ఘటనను జాతీయ మానవహక్కుల కిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. దీనిపై రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి ఇష్యూ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది..

*M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..!*

M.Venkaiah Naidu: M. Venkaiah Naidu: అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భాగంగా..

ఎగ్జిబిషన్‌ను భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేపు లోక్ మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. కాగా.. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు. మళ్ళీ తిరిగి మన మూలాలకు వెళ్ళాలన్నారు. మన సాంస్కృతిక వారసత్వాలను కాపాడుకోవాలన్నారు. మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలని తెలిపారు. మన సంస్కృతిని, మన భాషను, మన సంప్రదాయాలును మర్చిపోయామన్నారు. ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనదని తెలిపారు. ఇంగ్లీష్ వాడు ఆర్థికంగా దోచుకోవడమే కాదు మన మనస్సును కూడా దోచుకుని వెళ్ళిపోయాడన్నారు.

దేవుడి దగ్గర పోవాలని అంటే ఇంగ్లీషు రావాలనే షరతులేమి లేవని దేవుడు చెప్పారని అన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా రావాల్సిందే అని దేవుడు చెప్పారని తెలిపారు. ప్రముఖ వ్యక్తులు మాతృభాషలోనే చదువుకున్నారన్నారు. మోడీ ఇంగ్లీష్ మీడియం మొఖమే చూడలేదన్నారు. మనం భారతీయులం, మనం హిందువలమని గర్వంగా చెప్పుకోవాలని తెలిపారు. ఇంగ్లీష్ వ్యామోహం మంచిది కాదన్నారు. అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీషు నేర్చుకోవాలన్నారు. కుటుంబాలు, పెళ్ళిళ్ళు విచ్ఛిన్నం అవుతున్నాయని తెలిపారు. కుటంబ వ్యవస్థను పటిష్ఠం చేసుకుందామన్నారు. మనశ్శాంతిగా ఉంటే అనుకున్న పలితాలు సాధించవచ్చని అన్నారు. శిల్పారామంలో ప్రజ్ఞవాహిని ఆధ్వర్యంలో లోక్ మంథన్ పేరుతో కళా ప్రదర్శనల పండుగ నిర్వహిస్తున్నారు. నేటి (గురువారం) నుంచి ఆదివారం దాకా వివిధ అంశాలపై చర్చలు, సమావేశాలు జరగనున్నాయి. 12 దేశాల నుంచి 1500 మందికి పైగా కళాకారులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. 120కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా.. శిల్పారామంలో నాలుగు రోజుల పాటు ఉచితంగా సందర్శన నిర్వహించనున్నారు.