Letest news… లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్

సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీసుకి కేసీఆర్..

పాస్పోర్ట్ రెన్యువల్ కోసం కార్యాలయానికి వెళ్లిన కేసీఆర్..

వచ్చే నెలలో అమెరికాకు కేసీఆర్..

అమెరికాలో ఉంటున్న తన మనవడు హిమాన్షు వద్ద కొన్ని రోజులు ఉండనున్న కేసీఆర్..

SRSP చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని రహదారిపై రైతుల ధర్నా

సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో SRSP చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నూతనకల్ మండల కేంద్రంలో సూర్యాపేట – దంతాలపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు

యసంగి సీజన్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన..

సీఎం చంద్రబాబుకి వైఎస్ జగన్ వార్నింగ్

ఒక ప్రతిపక్ష నేత పర్యటనకు వస్తే కనీసం పోలీస్ భద్రత కూడా చంద్రబాబు ఇవ్వలేదు

ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు.. రేపు మేము వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో – మాజీ సీఎం వైఎస్ జగన్.

అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా?.. వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా?..బండి సంజయ్

తెలంగాణలో హిందువులది బిచ్చపు బ్రతుకైంది..

కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది

అదే అయ్యప్ప మాల, శివ మాల, ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదు? అన్నారు ..

*ఏపీలో టీచర్ల బదిలీలకు సన్నాహాలు*

అమరావతి :

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాలను రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజాప్రతినిధులకు వర్క్ షాప్ నిర్వహించి వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. త్వరలో చేపట్టనున్న డిఎస్సీ నిర్వహణ సన్నద్ధతపైనా లోకేష్ చర్చించారు..

అక్రమ వలసదారులకు సంకెళ్లు వీడియో పోస్టు చేసిన వైట్‌హౌస్‌..

అమెరికాలోని అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం. ఈ క్రమంలో వారికి సంకెళ్లు వేయడంపై అభ్యంతరం తెలుపుతున్న పలు దేశాలు

భారత్‌కు తీసుకొచ్చిన అక్రమ వలసదారులకు సైతం సంకెళ్లు వేసిన అమెరికా మిలిటరీ

ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులను హెచ్చరించేలా ఓ వీడియోను పోస్టు చేసిన వైట్‌హౌస్‌….

అరగంట యాడ్స్ వేసి తన సమయాన్ని వృధా చేశారని కేసు నమోదు..!

సినిమా ముందు అరగంట యాడ్స్ వేసి తన సమయాన్ని వృధా చేశారని PVR Inoxపై, బుక్ మై షోపై కేసు వేసిన బెంగళూరుకు చెందిన వ్యక్తి

2023లో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి సాయంత్రం 4 గంటల షోకు ఓ PVR Inoxలో సినిమాకు వెళ్లగా, అరగంట యాడ్స్ వేసి సినిమాను సాయంత్రం 4:30 గంటలకు మొదలెట్టారు

దీంతో 6 గంటలకు అయిపోవాల్సిన సినిమా 6:30 అయిపోయిందని, ఈ ఆలస్యం వల్ల తన షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకున్నానని PVR Inoxపై, బుక్ మై షోపై వ్యక్తి కేసు వేశాడు

సమయాన్ని వృధా చేసినందుకు PVR Inoxను వ్యక్తికి రూ.65000 చెల్లించాలని, అలాగే రూ.1,00,000 జరిమానా కట్టాలని కోర్టు తీర్పునిచ్చింది

సమయం వృధా కేసులో బుక్ మై షోకి సంబంధం లేదని మినహాయించింది…

తమ ఖాతాలో ఉన్న డబ్బులు తమకు ఇవ్వాలంటూ బ్యాంకులో రైతుల అర్ధనగ్న ప్రదర్శన

ఆదిలాబాద్ రూరల్ భీంపూర్ మండలం వడూర్ గ్రామానికి చెందిన జిల్లెల మోహన్ రూ. లక్ష, ఆదిలాబాద్ మండలంలోని యాపల్గూడ గ్రామానికి చెందిన రైతు నల్ల విలాస్ రూ.76 వేలు, నక్కల జగదీష్ రూ.2లక్షలు గత ఏడాది పత్తి పంటకు సంబంధించిన డబ్బును పోస్టాఫీసు ఖాతాలో జమచేశారు..

అయితే ఈ డబ్బు జమచేసిన వెంటనే గత సంవత్సరం సంబంధిత అప్పటి పోస్టాఫీస్ మేనేజర్ విజయ్ జాదవ్ సైబర్ క్రైంకు పాల్పడడంతో పోలీసులు కేసునమోదు చేశారు.. ఈ క్రమంలో రైతులకు రావాల్సిన డబ్బులు సంబంధిత ఢిల్లీ బ్యాంక్ హోల్డ్లో ఉంచారు

అయితే కొంతమంది రైతులకు
అప్పుడు జరిగిన ఆందోళనతో కలెక్టర్ రాజర్షి షా జోక్యంతో డబ్బులు చెల్లించడం జరగగా.. మరికొంతమంది రైతులకు చెల్లింపులు కాలేదు

దీంతో ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్ లోని ఎస్బీఐ బ్యాంకులో కొంత మంది రైతులు చొక్కాలు విప్పి నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు…

*భారత్‌ దగ్గర డబ్బు ఉంది.. ఆ ఫండ్‌ ఎందుకు?: ట్రంప్‌*

భారత్‌లో ఎన్నికల కోసం ఇచ్చే 21 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ను ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ, “భారత్‌ దగ్గర చాలా డబ్బు ఉంది. ఈ మొత్తం ఎందుకు ఇవ్వాలి?” అని ప్రశ్నించారు.

అయితే, భారత్‌ మరియు ప్రధాని మోదీ పట్ల తనకు గౌరవం ఉందని కూడా ట్రంప్‌ స్పష్టం చేశారు….

ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం

ఢిల్లీకి నాలుగో సారి మహిళ సీఎంగా ఉండనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశీ (ఆప్) సీఎంలుగా పని చేశారు. తాజాగా రేఖా గుప్తా (బీజేపీ) ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశంలోని 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, అందరూ పురుష సీఎంలే ఉన్నారు. వ్యూహంలో భాగంగానే ఢిల్లీ పీఠం మహిళకు అప్పగించినట్లు తెలుస్తోంది…

.

కెసిఆర్ పగటి కలలు కంటున్నాడు….అధికారంలోకి వ‌స్తామ‌ని కేసీఆర్ ప‌గ‌టిక‌ల‌లు కంటున్నారు..కేసీఆర్ ఒక సీజ‌న‌ల్ పొలిటీషియ‌న్‌……….మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి.

14 నెల‌ల నుంచి అజ్ఞాతంలో ఉన్న వ్య‌క్తికి అభివృద్ధి ఎలా క‌న‌బ‌డుతుంది……..

రెవిన్యూ,హౌసింగ్ ,
స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మ స్వ‌ర్గానికి ఎగిరింద‌న్న‌ట్లు ఫాంహౌస్ దాట‌ని దొర‌వారు అధికారంపై ప‌గ‌టిక‌ల‌లు కంటున్నారని రెవెన్యూ , హౌసింగ్ ,స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఎద్దేవా చేశారు.

అధికారం కోల్పోగానే త‌న‌కు ప‌దేళ్లు అధికారం కట్ట‌బెట్టిన ప్ర‌జ‌ల‌ను మ‌రిచి అజ్ఞాతంలోకి వెళ్లిన కేసీఆర్ గారికి, 14 నెల‌లుగా కాంగ్రెస్ పాల‌న‌లో జ‌రుగుతున్న అభివృద్ది
ఏ విధంగా క‌న‌బ‌డుతుంది.

కేసీఆర్ ఒక సీజ‌న‌ల్ పొలిటీషియ‌న్ , ఎన్నిక‌ల‌ప్పుడు మాత్ర‌మే ఆయ‌న‌కు ప్ర‌జ‌లు గుర్తుకొస్తారు. 14 నెల‌ల నుంచి ఫాంహౌస్ దాట‌ని ఆయ‌న స్ధానిక ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మంత్రి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు………..

మేడిగ‌డ్డ కుంగిన‌ప్పుడు గాని, రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు గాని ఆయ‌న‌కు ప్ర‌జ‌లు గుర్తుకురాలేదు. శాస‌న‌స‌భ‌లో కీల‌క‌మైన తీర్మానాలు, కుల‌గ‌ణ‌న, ఎస్సీవ‌ర్గీక‌ర‌ణ‌, భూభార‌తి బిల్లు, తెలంగాణ ఏర్పాటులో కీల‌క భూమిక పోషించిన మ‌న్మోహ‌న్ సింగ్ సంతాప తీర్మానానికి కూడా కేసీఆర్ హాజ‌రుకాలేదు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సైతం గైర్హాజ‌ర‌య్యారు………

తెలంగాణ ప్ర‌జ‌లు క‌ష్ట‌ప‌డి కేసీఆర్‌ను ప్ర‌తిప‌క్షంలో కూర్చోబెడితే, ఆయ‌న ఏనాడు ప్ర‌జాతీర్పును గౌర‌వించ‌లేదు. అసెంబ్లీ వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తిప‌క్ష‌నేత అసెంబ్లీకి హాజ‌రై ప్రజా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాలి. కానీ కేసీఆర్ తాను ప్ర‌జ‌లు జ‌వాబుదారీగా లేన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఆయ‌న అసెంబ్లీకి వ‌స్తే ఆయ‌న ప‌దేళ్ల పాల‌న‌లో రాష్ట్రాన్ని ఏవిధంగా తిరోగ‌మ‌న‌దిశ‌లోకి తీసుకెళ్లారు, ప‌దేళ్ల‌లో ఆయ‌న చేసిన నిర్వాకాల‌ను త‌ప్పుల‌ను ఒక్కోక్క‌టిగా స‌రిచేసుకుంటూ 14నెల‌ల్లో తాము సాధించిన అభివృద్దిని స‌వివ‌రంగా కేసీఆర్ ముందుంచుతాం………

కాంగ్రెస్ భ‌విష్య‌త్ గురించి కాకుండా ముందుగా కేసీఆర్ త‌న భ‌విష్య‌త్తు, త‌న పార్టీ భ‌విష్య‌త్తు గురించి ఆలోచిస్తే బాగుంటుంది……..

కేసీఆర్ భ‌విష్య‌త్తుపై గ‌త పార్లమెంటు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చారు. పార్ల‌మెంటు తీర్పే భ‌విష్య‌త్తులో ఉంటుంది…….

విప‌రీత‌మైన అప్పులు చేసి నెత్తిన‌మీద మిత్తిల భారం పెట్టిపోయారు . ప‌దేళ్ల‌లో కేసీఆర్ చేసిన అప్పుల‌కు తెలంగాణ స‌మాజం ఆయ‌న‌ను ఎన్న‌టికీ క్ష‌మించదు……..

నువ్వు వ‌ద్దు, నీ పాల‌న వ‌ద్దూ మ‌హాప్ర‌భో అని తెలంగాణ ప్ర‌జ‌లు వ‌దిలించుకున్నా ఇంకా వ‌దిలేది లేద‌న్న‌ట్లుగా కేసీఆర్ వ్య‌వ‌హారం ఉంది…..

ట్రాక్టర్ తో పంట తొక్కించిన అధికారులు.. ఊపిరి వదిలిన రైతు..

చేతికి అంది వచ్చిన పంటను అధికారులు ట్రాక్టర్ తో తొక్కించి నాశనం చేయడంతో తట్టుకోలేని రైతు పొలంలోనే కుప్పకూలి(Farmer Collapse) మరణించాడు..భార్య బిడ్డలతో కలిసి పంట నాశనం చేయవద్దని అధికారుల కాళ్లావేళ్ళా పడ్డప్పటికీ.. అధికారులు కనికరించలేదు. దీంతో దిక్కుతోచని రైతు అదే పొలంలో గుండె ఆగి మరణించాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో(MP)ని విదిష జిల్లాలో జరిగింది. సిరోంజ్‌లోని కేతన్ ఆనకట్ట ప్రాంతంలో మూల్ చంద్ అనే రైతు సుమారు 20 ఎకరాల్లో చేను సాగు చేశాడు. పంట కోతకు వచ్చిన దశలో అధికారులు ట్రాక్టర్లతో వచ్చి.. ఆ పంట మొత్తం తొక్కించి నాశనం చేశారు. కొద్దిరోజుల్లో పంట కోస్తామని, అప్పటిదాకా ఆగాలని మూల్ చంద్ తన భార్య బిడ్డలతో సహ అధికారుల కాళ్ళపై పది వేడుకున్నాడు. అయినప్పటికీ అధికారులు ఎవరూ అతని మాట పట్టించుకోలేదు..పంట మొత్తం నాశనం చేయగా.. అది చూసి తట్టుకోలేని రైతు బాధతో చేనులోనే కుప్పకూలి మరణించాడు. రైతు మరణించిన తర్వాత అధికారులు చూసి చూడనట్టు అక్కడినుంచి జారుకున్నారు. పైగా ఈ ఘటనపై తమ చర్యలను సమర్థించుకున్నారు. అది ప్రభుత్వ భూమి అని, ప్రభుత్వ భూమిలో అక్రమంగా సాగు చేసినందుకే.. ఆ భూమిని విడిపించడానికి అలా చేశామని అన్నారు. అయితే రైతు భార్య మాత్రం ఆ భూమి తమదే అని, దానిపై గత ఏడాది కట్టిన పన్ను రసీదులు అధికారులకు చూపించినా పట్టించుకోలేదని.. ఇపుడు తమ కుటుంబం అన్యాయం అయిందని కన్నీరుమున్నీరు అయింది. ఈ నేపథ్యంలో రైతు పంటను ధ్వంసం చేసిన అధికారుల తీరుపై విమర్శలతోపాటు రాజకీయంగా దుమారం రేగుతోంది.

తుపాను ఉపరితల ఆవర్తనం, ఈ 13 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక.

బంగాళాఖాతంలో ఏ‍ర్పడిన తుఫాను కారణంగా ఈశాన్య భారతంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే ఏడు రోజుల్లో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని, పర్వత ప్రాంతాల్లో విపరీతంగా మంచుకురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది..వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ తుఫాను ప్రభావం నాగాలాండ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ఉండనుంది. ఫిబ్రవరి 19న అసోం, మేఘాలయలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 21న పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర, హిమాలయ,పశ్చిమబెంగాల్‌, సిక్కిం తదితర రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలకు ఇప్పటికే వర్ష సూచన హెచ్చరికలు జారీ చేశారు. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో బీహార్‌లోని 16 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో బుధవారం, గురువారం ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19, 20 తేదీలలో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.