లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ l..

సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదు..ఎంపీ ధర్మపురి అరవింద్..

సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదని, ఓ పక్క మోడీని మంచోడంటూనే మరో వైపు కిషన్ రెడ్డిని చెడ్డోడు అంటున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు..సోమవారం ఢిల్లీ నుంచి సెల్పీ వీడియో విడుదల చేశారు. తెలంగాణలో జరిగే అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎక్కడ అడ్డుకున్నాడో చెప్పాలని అరవింద్ సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకున్నాడో చెప్పాలని కోరారు. ప్రాజెక్టుల కోసం ఇవ్వాల్సిన భూములెన్ని ఇచ్చారో ఓ సారి లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సింది ఎంత మేర ఇచ్చారో చెప్పాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ మీ వైపు నుండి చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇవన్నీ మీరు చేస్తున్నప్పటికీ ప్రధాని మోడీ ఏం ఇవ్వడం లేదని చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ‘తెలంగాణ నుంచి నువ్వేం ప్రపోజల్స్ పెట్టావో, ఏం ఫార్మాలిటీస్ పూర్తి చేశారో, రాష్ట్ర వాటాగా నువ్వెంత చెల్లించావో’ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి ఎక్కడ అభివృద్ధి పనులను అడ్డుకున్నాడో చెపితే బాగుంటుందని రేవంత్ రెడ్డికి చురకలంటించారు.

‘నీకన్నా నేను చిన్నోన్ని.. నేనైతే నువ్వెప్పుడు సల్లగుండాలని, మంచిగా పరిపాలన చేయాలని, సక్సెస్ ఫుల్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అర్వింద్ ధర్మపురి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బృందాన్ని పంపిస్తే.. కిషన్ రెడ్డిని తీసుకొని వెళ్లి స్వయంగా తానే కోఆర్డినేట్ చేస్తానని అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడా? సహకరిస్తున్నాడా అనే విషయం అక్కడే అధికారుల ముందే తేలుతుందని అన్నారు.

మోడీ దేశాన్నంతటిని సమానంగా చూస్తారు

మోడీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తారని పేర్కొన్నారు. రొటీన్‌గా అయ్యే ప్రాజెక్టులు రీజినల్ రింగు రోడ్డు వంటివి అవుతాయన్నారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించిన డీపీఆర్ వ్యవహారాలన్నీ చెప్పాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా పరిష్కారం కాని జాతీయ పసుపు బోర్డు సాధించడంలో కీలక పాత్ర పోషించానని, రోటిన్ ప్రాజెక్టుల విషయంలో నాకో పెద్ద పని కాదని అర్వింద్ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలను మభ్య పెట్టడానికో, మీ హామీల విషయంలో ప్రజల వ్యతిరేకతను మళ్లించేందుకో మాట్లాడొద్దని అర్వింద్ సీఎం రేవంత్‌కు వార్నింగ్ ఇచ్చారు..

సిద్దరామయ్యకు ఝలక్‌.. కర్ణాటక సీఎంగా డీకే?.

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొన్నటివరకు నివురుగప్పిన నిప్పులా వర్గ రాజకీయాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు తమ గళాన్ని వినిపిస్తోన్నారు..బాహటంగానే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మద్దతు పలుకుతున్నారు…..తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ కూడా హింట్‌ ఇస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ త్వరలోనే సీఎంగా బాధ్యతలు చేపడతారని చెప్పుకొచ్చారు. దీంతో, కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ మొదలైంది…

ఒకే వేదికపై డీకే శివకుమార్, అమిత్ షా
కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్‌లో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో డీకే శివకుమార్ పాల్గొన్న విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన వేదికను పంచుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్ణాటక రాజకీయాల్లో ఓ చిన్న సైజు సునామీని లేవదీసింది. ఇది అక్కడితో ఆగలేదు. దీనికి కొనసాగింపు సైతం చోటు చేసుకుంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ అడ్దుకోలేరంటూ ఉడుపిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్‌లో కల్లోలాన్ని రేపింది. డీకే శివకుమార్‌లో మంచి నాయకత్వం లక్షణాలు ఉన్నాయని, రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించారని అన్నారు. జనం ఏవేవో చెప్పుకొంటోన్నారు గానీ ఆయనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి కావడం డీకేశికి బహుమతిగా ఇవ్వాల్సింది కాదని కష్టపడి సంపాదించినదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై డీకే శివకుమార్ సైతం తాజాగా స్పందించారు. వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై తానేమీ మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు. ఆయన ఏం చెప్పారనేది తెలియదని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు డీకేశి. పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందని, దీనికోసం పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉందని, బూత్ స్థాయిలో కమిటీలతో సమావేశం కానున్నానని చెప్పారు.
వీరప్ప మొయలీ వ్యాఖ్యలు వ్యక్తిగతం
వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ప్రియాంక్ ఖర్గే, సంతోష్ లాడ్ మాట్లాడారు. ఇప్పటికిప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటూ మొయిలీ చెప్పలేదని, ఏదో ఒక రోజు సీఎం అవుతాడనే అన్నాడని గుర్తు చేశారు. కష్టపడి పని చేసినందుకు డీకేకు రివార్డ్ దక్కడం ఖాయమేనని, ఈ విషయాన్ని ఖరారు చేయాల్సింది పార్టీ హైకమాండ్ మాత్రమేనని చెప్పారు. ప్రస్తుతానికి తమ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రమేనని, ముఖ్యమంత్రి ఎవరనేది మీడియా ముందు నిల్చొని నిర్ణయించేది కాదని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. పార్టీ, ప్రజల కోసం కష్టపడి పని చేసిన వాళ్లకు ఏదో ఒక రోజు రివార్డు దక్కుతుందని అన్నారు. వీరప్ప మొయలీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు..

గాజాకు సాయం ఆపేసిన ఇజ్రాయెల్‌..

హమాస్‌తో కాల్పుల విరమణ తొలి దశ ఒప్పందం శనివారం ముగిసిన నేపథ్యంలో గాజాలోకి మానవతా సాయాన్ని నిలిపేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది..

గాజాకు ఆహారం, ఇతర సరకులు సరఫరా చేసే వాహనాలను ఇజ్రాయెల్‌ అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో అమెరికా కీలక ప్రకటన చేసింది..ఇజ్రాయెల్‌ ఏ నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది. టెల్‌అవీవ్‌కు అండగా ఉంటామని అగ్రరాజ్యం జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి బ్రయాన్‌ హ్యూజ్‌ తెలిపారు. నెతన్యాహు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనపై మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే ఈ కొత్త ప్రతిపాదన ట్రంప్‌ యంత్రాంగం నుంచే వచ్చిందని ఇజ్రాయెల్‌ చెబుతోంది. దీని ప్రకారం.. హమాస్‌ తన దగ్గర ఉన్న సగం మంది బందీలను విడిచిపెట్టాలి. ఇందుకు హమాస్‌ ససేమిరా అంటోంది. జనవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్లాలని చెబుతోంది. గాజాకు మానవతా సాయాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెల్‌ అవీవ్‌ ఆకలిని ఆయుధంగా వాడుకుంటోందని ఈజిప్టుతో పాటు.. ఖతార్‌ కూడా ఆక్షేపించింది. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కూడా ఇజ్రాయెల్‌ వైఖరిని తప్పుబడుతున్నాయి.

మరోవైపు ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలో ఉగ్ర దాడి జరిగింది. బస్‌స్టేషన్‌లోని జనంపై అరబ్‌ సంతతికి చెందిన ఇజ్రాయెల్‌ పౌరుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురికి గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చి చంపాయి.

ఛార్లెస్, ట్రూడో రహస్య సంభాషణ

లండన్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపుపై ఆదివారం జరిగిన ఐరోపా దేశాల సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌కు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. సోమవారం బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3తో సమావేశమయ్యారు. శాండ్రింగ్‌హాం రాజ ప్రాసాదానికి వచ్చిన ట్రూడోకు రాజు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారిద్దరు రహస్య సంభాషణ జరిపారు. దీంతో ఆ వివరాలను రాజ ప్రాసాదం అధికారులు వెల్లడించలేదు. అయితే కెనడాను 51వ రాష్ట్రంగా చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికలపై వారు చర్చించినట్లు సమాచారం… ప్రస్తుతం ఇది ఏ మేరకు ఉధృప్తిని సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

కరోనా కంటే ప్రమాదకరం కాంగ్రస్ పార్టి, రేవంత్ రెడ్డి.. కెటిఆర్

కేసీఆర్‌ పదేళ్ల స్వర్ణయుగాన్ని చెరిపేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాసుకునే చీకటి చరిత్ర ఇదేనా అని ప్రశ్నించారు. గతేడాది 10శాతం నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే ఒక్కశాతం వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటన్నారు. కరోనా కన్నా ప్రమాదకరమైన వైరస్‌ కాంగ్రెస్‌ అని, ఏడాది క్రితం తాను చెప్పింది అక్షరాలా నిజమైందన్నారు.ఎ్‌సఎల్‌బీసీలో సెంటీమీటర్‌ సొరంగం తవ్వడం కూడా చేతకాని సీఎం, 12 కిలోమీటర్ల టన్నెల్‌ పూర్తిచేసిన బీఆర్‌ఎ్‌సపై నిందలు వేయడం సిగ్గుచేటని కేటీఆర్‌ చెప్పారు. రేవంత్‌ రెడ్డి తన వైఫల్యాన్ని గత ప్రభుత్వంపైకి నెట్టాలనుకోవడం దుర్మార్గమన్నారు..

వేగం తగ్గిన అంటార్కిటిక్‌ ప్రవాహం…

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహాసముద్రం అంటార్కిటిక్‌ ప్రవాహ వేగం తగ్గుతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. వాతావరణ మార్పులే దీనికి కారణమని, దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు..సముద్ర మట్టాల పెరుగుదల, మహాసముద్రాలు వేడెక్కడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయని చెప్పారు.

అంటార్కిటిక్‌ సర్కమ్‌పోలార్‌ కరంట్‌ (ఏసీసీ) సవ్య దిశలో ప్రవహిస్తుంది. ఇది గల్ఫ్‌ ప్రవాహం కన్నా నాలుగు రెట్లు శక్తిమంతమైనది. భూ మండలంలో వాతావరణం అందరికీ అనుకూలంగా ఉండేలా చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తున్నది. మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ నివేదిక ‘ఎన్విరాన్‌మెంటల్‌ రిసెర్చ్‌ లెటర్స్‌’లో ప్రచురితమైంది..

పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి సమీక్షజిల్లాలు, నియోజకవర్గాలవారీగా నెలకొన్న పరిస్థితులపై ఆరా ఎన్నికల్లో గెలుపే లక్షంగా దిశానిర్దేశం…

కాంగ్రెస్ ను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందు కు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ తన కార్యాచరణ చే పట్టారు. అందులోభాగంగా పార్లమెంట రీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలను ఆమె నిర్వహించనున్నారు. ఈ క్ర మంలోనే నేడు (మంగళవారం) ఆమె అ ధ్యక్షతన మధ్యాహ్నం 2.00 గంటలకు మెదక్‌నియోజకవర్గం, సాయంత్రం5 గంటలకు మల్కాజిగిరి పార్లమెంటరీ ని యోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే బుధవారం ఉద యం 11గంటలకు కరీంనగర్, మ ధ్యాహ్నం 2గంటలకు ఆదిలాబాద్, సా యంత్రం 5గంటలకు పెద్దపల్లి పార్లమెం ట్ల వారీగా నియోజకవర్గాల నేతలు, పా ర్టీ కేడర్‌తో ఆమె సమీక్ష చేయనున్నారు. ఇప్పటికే ఆమె పలు జిల్లాలో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీ పరిస్థితి గు రించి సర్వే నిర్వహించినట్టుగా తెలిసిం ది.ప్రస్తుతం జిల్లాల వారీగా ఇన్‌చార్జీ మంత్రులు, జిల్లాల మంత్రుల మధ్య ఉ న్న విభేదాలు, ఆయా జిల్లాలో కేడర్‌కు, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయితీలపై ఒక నివేదిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలిసింది.

సర్వేతో కేడర్‌కు క్లాస్.. ఎవరికి మినహాయింపు కాదు…

నేటి నుంచి జరుగనున్న నియోజకవర్గాల సమీక్షకు ఆమె చేయించిన సర్వే ఆధారంగా వారికి పలు సూచనలు, సలహాలతో వారికి క్లాస్ తీసుకోనున్నట్టుగా తెలిసింది.వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు పూర్తయిన అనంతరం స్థా నిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ ఘన వి జయం సాధించేందుకు ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై ఆమె జిల్లాల వారీ గా చర్చించే అవకాముందని సమాచా రం. అదే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వా న్ని లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు బిజె పి, బిఆర్‌ఎస్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సమయంలో జిల్లాల్లో ని యోజకవర్గాల స్థాయిలో ఉన్న లోపాలను ఎలా సరిచేసుకొని ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై కూడా నియోజకవర్గాల సమీక్షలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు పదవులు రాకుండా అసంతృప్తితో ఉన్న కేడర్‌లో సైతం ఉత్సాహాం నింపేలా ఆమె ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా పార్టీ కోసం చాలా ఏళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్న కేడర్ వివరాలను కూడా ఆమె సేకరించినట్టుగా సమాచారం.

ఇలా వారికి కచ్చితంగా ఏదో పదవులను అప్పగించి పార్టీలో నూతనోత్తేజాన్ని నింపి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా ఆమె వ్యూహాలు రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైనా పార్టీ పదవులు, ప్రభుత్వ పదవుల కోసం ఫైరవీలు చేస్తే వారికి ఎలాంటి పదవులు ఇవ్వమని ఆమె ఇప్పటికే సూచించడంతో పలువురు ఫైరవీకారులు అసంతృప్తికి లోనవుతున్నారు. నిజంగా ఇలాంటి చర్యలు చేపడితే రానున్న రోజుల్లో కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన ఫలితం దక్కుతుందని పార్టీ వర్గాల్లో ఆశలు వెల్లివిరుస్తున్నాయి..

*బ్రేకింగ్ న్యూస్.*.

*తూర్పుగోదావరి జిల్లా*

*రాజమండ్రి*..

రాజమండ్రి పుష్కర ఘాటులో బోటు మునక…

ముగ్గురు గల్లంతయినట్లు సమాచారం…

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

కోడిపందాల కోసం గోదావరి లంకలోకి యువకులు వెళ్లినట్లు సమాచారం..

గాడ రాజు, చబల అన్నవరం తోపాటు మరో వ్యక్తి గోదావరిలో కొట్టుకుపోయినట్లు సమాచారం..

Imran In Death Cell

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను రావల్పిండిలో అదియాలా జైలు డెత్‌సెల్‌లో ఏకాంత నిర్బంధంలో ఉంచారని ‘పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌’ (పీటీఐ) సోమవారం తెలిపింది. ప్రస్తుతం ఆయనను ఉంచిన డెత్‌సెల్‌ ఉగ్రవాదుల కోసం నిర్దేశించిందని, విచారణ ఖైదీ అయిన ఓ మాజీ ప్రధాని పట్ల జైలు అధికారులు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. ‘‘ఇమ్రాన్‌ను కలిసేందుకు ఆరుగురు వ్యక్తులకు కోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ జైలు అధికారులు అనుమతించట్లేదు. ఆయన భార్యను సైతం ఎలాంటి వివరణ ఇవ్వకుండా రెండుసార్లు తిప్పిపంపించారు. పుస్తకాలు, వార్తా పత్రికలను ఇవ్వడంలేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఇమ్రాన్‌ దృఢ సంకల్పంతో ఉన్నారు’’ అని పార్టీ వెల్లడించింది. పలు కేసులకు సంబంధించి 2023 ఆగస్టు 5న అరెస్టైన ఇమ్రాన్‌ఖాన్‌ అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు.