ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్న ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్ దేవగణ్.
తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆసక్తత…
_• ఏఐ సాంకేతికత జోడింపుతో వీఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటు…_
_• ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేత..
తండ్రీకొడుకులకు బీఆర్ఎస్ ఝలక్
మైనంపల్లిపై కార్యకర్తల అసంతృప్తి, కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరిక .
మెదక్ ప్రజలను పట్టించుకోకుండా కార్లతో రీల్స్ చేసుకుంటూ టైంపాస్ చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రావు
కార్యకర్తలను, ప్రజలను పక్కన పెట్టి సిటీలో దందా నడిపించుకుంటూ కాలం వెళ్లదీస్తున్న హనుమంతరావు
తండ్రీకొడుకుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన కార్యకర్తలు, కాంగ్రెస్‌లోకి వచ్చి మునిగిపోయామని ఆవేదన
స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీని వీడిన కార్యకర్తలు
షాక్‌లో మైనంపల్లి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్‌కు బయలుదేరిన కార్యకర్తలు..
_• తెలంగాణ క్యాబినెట్ ఈనెల 10న భేటీ కానుంది. రాష్ట్ర సచివాలయంలోని సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు, ప్రభుత్వ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. అటు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
*_రైతుల ఖాతాల్లో రూ.2 వేలు.. ముహూర్తం ఫిక్స్!_*
Rythu Bandhu scheme : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం అందించింది.
దీనిని స్ఫూర్తిగా తీసుకుని 2018లో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభించింది. 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో అందిస్తోంది.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 20వ విడత ఆర్థిక సాయం ఈ నెలలో రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు సమాచారం. ఈ నెల 18న నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిహార్ పర్యటనకు రెండు రోజుల ముందు, అంటే 20వ తేదీకి ముందు ఈ చర్య తీసుకోవచ్చని అంచనా. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9.3 కోట్లకు పైగా రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు (విడతకు రూ.2 వేలు) అందించబడుతోంది. అయితే, ఈ విడత విడుదలపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.
రైతులకు ఊరట
2018లో ప్రారంభమైన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని చిన్న, సన్నకరు రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి రూపొందించబడింది. ఈ పథకం కింద రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ ద్వారా ఆర్థిక సాయం అందజేయబడుతుంది. ఈ పథకం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 2024 జూన్‌లో 19వ విడతగా రూ.20 వేల కోట్లు విడుదల చేయగా, ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.3.45 లక్షల కోట్లకు పైగా నిధులు రైతులకు చేరాయి.
బిహార్ పర్యటన వేళ..
ప్రధానమంత్రి మోదీ ఈ నెల 20న బిహార్‌లో పర్యటించనున్న నేపథ్యంలో, 20వ విడత నిధుల విడుదల రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. బిహార్‌లో రైతు సంఖ్య ఎక్కువగా ఉండటం, ఈ పథకం అక్కడి రైతులకు గణనీయమైన సహాయం అందించడం వల్ల, ఈ పర్యటన సందర్భంగా నిధుల విడుదల రైతుల్లో సానుకూల సందేశాన్ని పంపే అవకాశం ఉంది. ఈ సమయంలో నిధుల విడుదల రైతుల్లో ఆశాభావాన్ని రేకెత్తిస్తుందని, అదే సమయంలో ప్రభుత్వం రైతు సంక్షేమ నిబద్ధతను బలపరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రైతు సంక్షేమంలో కీలకపాత్ర..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం భారత రైతులకు ఆర్థిక భద్రతా వలయంగా పనిచేస్తోంది, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనిశ్చితి, అధిక ఉత్పత్తి ఖర్చులు, తక్కువ ఆదాయాల సమస్యలను ఎదుర్కొంటున్న చిన్న రైతులకు. ఈ పథకం ద్వారా రూ.2 వేలు రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఖర్చు చేసే అవకాశం కల్పిస్తోంది. అయితే, కొందరు విమర్శకులు ఈ మొత్తం సరిపోదని, వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని వాదిస్తున్నారు. ఈ పథకం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో పరిమిత పాత్ర పోషిస్తున్నప్పటికీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచడంలో, వినియోగ వ్యయాన్ని పెంచడంలో సహాయపడుతోంది..
భారత్ సరిహద్దుల్లో భారీ భూకంపం..
జపాన్‌లో భారీ సునామీ వస్తుందని, అంతం అవుతుందని బాబా వంగా తన పుస్తకంలో రాశారని గత రెండు రోజుల క్రితం జోరుగా ప్రచారం సాగింది..అయితే అప్పటి నుంచి ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు యుగాంతానికి మొదలు తెలుస్తోంది. జపాన్‌లో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అలాగే అమెరికాలో భారీగా వరదలు వస్తున్నాయి. వీటితో పాటు ఇండియా, మయన్మార్ సరిహద్దులో భూకంపం వచ్చింది..
36 గంటల్లో 6 సార్లు..
రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనాలు సృష్టించింది. 36గంటల వ్యవధిలో 6 సార్లు భూమి కంపించింది. దీంతో సరిహద్దుల్లోని మణిపూర్ ప్రజలు భూకంపంతో వణికిపోతున్నారు. దీంతో దేశంలో యుగాంతం ఎఫెక్ట్ మొదలైందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే లాస్ఏంజిల్స్, కాలిఫోర్నియాకు భూకంప హెచ్చరికలు జారీ చేశారు..ఇదిలా ఉండగా జూలై 5వ తేదీన ప్రళయం వస్తుందని జపాన్‌కు చెందిన న్యూ బాబా వంగా తన ప్రిడిక్షన్లో రాశారు. జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని, ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతారని 1999లో ది ఫ్యూచర్ ఐసా లో అనే పుస్తకంలో రాశారు. అయితే నిజంగానే జపాన్‌లో భూకంపం సంభవిస్తుందని, యుగాంతం తప్పదని ప్రజలు భయపడ్డారు. యుగాంతం అయితే రాలేదు.. కానీ జపాన్‌లో భూకంపాలు మాత్రం వచ్చాయి.
*కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్‌లను*
*నియమించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్*
1.ఖమ్మం- వంశీచంద్‌రెడ్డి
2.నల్గొండ- సంపత్ కుమార్
3.మెదక్- పొన్నం ప్రభాకర్
4.వరంగల్- అడ్లూరి లక్ష్మణ్
5.హైదరాబాద్- జగ్గారెడ్డి
6.రంగారెడ్డి- శివసేనారెడ్డి
7.ఆదిలాబాద్- అనిల్ కుమార్ యాదవ్
8.కరీంనగర్- అద్దంకి దయాకర్
9.మహబూబ్‌నగర్- కుసుమ కుమార్
10.నిజామాబాద్- అజ్మత్ హుస్సేన్.
జూలై-ఆగస్టు ప్రయాణ రద్దీ కోసం దక్షిణ మధ్య రైల్వే 33 ప్రత్యేక రైళ్లను నడపనుంది
జూలై-ఆగస్టు 2025 కాలంలో పెరిగిన ప్రయాణీకుల డిమాండ్‌కు ప్రతిస్పందనగా, దక్షిణ మధ్య రైల్వే కీలక మార్గాల్లో 33 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. వీటిలో ఆదివారాలు మరియు సోమవారాల్లో నడిచే సికింద్రాబాద్ మరియు అర్సికెరె (రైలు నం. 07079/07080) మధ్య వారపు సర్వీసులు మరియు మంగళవారాలు మరియు బుధవారాల్లో హైదరాబాద్ మరియు అర్సికెరె (రైలు నం. 07069/07070) మధ్య వారపు సర్వీసులు ఉన్నాయి.
ఈ రైళ్లు జూలై 8 నుండి సెప్టెంబర్ 1 వరకు నడుస్తాయి, గుంతకల్, ధోన్, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్ మరియు యలహంక వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. కోచ్‌లలో 2AC, 3AC, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ ఉంటాయి.
అదనంగా, జూలై 8న కాచిగూడ నుండి తిరుపతికి ఒక ప్రత్యేక సర్వీసు (రైలు నంబర్ 07676) నడుస్తుంది, ఇందులో బెడ్‌రోల్ సేవలు లేకుండా పూర్తిగా 3AC కోచ్‌లు ఉంటాయి. ఈ చర్య కాలానుగుణ ప్రయాణ డిమాండ్‌ను నిర్వహించడం మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక అంతటా సున్నితమైన కనెక్టివిటీని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు తదనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని మరియు ముందుగానే షెడ్యూల్‌లను తనిఖీ చేయాలని సూచించింది..
సిద్దిపేట అంటే పందులు గుర్తుకు వచ్చేవి..కేటీఆర్. మెదక్ అంటే గాడిదలు గుర్తుకు వస్తాయని హరీష్ రావు చెప్పేవారు
సిద్దిపేటలో పందులు మాయం అయ్యాయి కానీ మెదక్‌లో మాత్రం ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయి అన్నారు ….
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మైనంపల్లి అనుచరులు
స్థానిక ఎమ్మెల్యే సొంత గ్రామం కొర్విపల్లి నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక
భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్ కు కదిలిన మెదక్ జిల్లా కాంగ్రెస్ క్యాడర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరిక
భారీ కాన్వాయ్‌ని జెండా ఊపి ప్రారంభించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి
బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ….
తిరుపతి లో నిన్న సైకో చేసిన వీరంగం
వలవేసి పట్టుకున్న పోలీసులు.
నేడు ఇద్దరి ముగ్గురకి కత్తిపోట్లు కావడం జరిగిన విషయం తెలిసిందే నేడు
వల వేసి పట్టుకున్న తిరుపతి పోలీస్‌లు …….
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిల్ తీర్థం రోడ్డులో ఓ సైకో కత్తితో వీరంగం సృష్టిస్తు ముగ్గురి పై దాడి చేసాడు. వీరిలో ఒకరు మృతి చెందగా, ఇరువురికి గాయాలు అయ్యాయి. సైకోప్ దాడిలో గాయపడిన మృతుడు శేఖర్ (55) గా గుర్తించారు. కపిలతీర్థం పార్కింగ్ లో పనిచేసే సుబ్రహ్మణ్యం, అదే ప్రాంతంలో ఉంటున్న కల్పన కు గాయాలు కాగా రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతఝన్నారు. దాదాపు గంటసేపు స్థానికులు, పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది కష్టపడి నిందితుని వలవేసి పట్టుకున్నారు. అయితే సైకో తమిళనాడుకు చెందినవాడుగా గుర్తించి, బంధించారు. ..