హుజూర్ నగర్ వాసి రామిశెట్టి శ్రీనివాస్ కు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్..

*హుజూర్ నగర్ వాసి రామిశెట్టి శ్రీనివాస్ కు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్..*..

హుజూర్నగర్ ప్రభుత్వ ఎన్ఎస్పి క్యాంపు పాఠశాలలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించి చిన్ననాటి మిత్రుడు రామిశెట్టి శ్రీనివాస్ కు  గవర్నర్  జిష్ణు దేవ్ శర్మ  చేతుల మీదుగా  డాక్టరేట్ తీసుకోవడం హర్షించదగిన విషయం అంటూ రామిశెట్టి శ్రీనివాస్ మిత్రబృందం అతనికి అభినందనలు తెలిపారు……

వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం లో ఈరోజు జరిగిన..23 వ స్నాత కోత్సవంలో   తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  అధ్యక్షతన  ఏర్పాటు చేయడం జరిగింది..

ఈ కార్యక్రమం లో హుజూర్ నగర్ పట్టణానికి చెందిన డాక్టర్ రామిశెట్టి శ్రీనివాస్ గవర్నర్ చేతుల మీదగా అర్ధ శాస్త్రం లో డాక్టరేట్ పట్టాను  స్వీకరించడం జరిగింది..

తెలంగాణలోని గిరిజనుల ఆర్థిక మరియు జీవనస్థితిగతులపై  నిర్వహించినందుకు గాను పరిశోధన పత్రం అందజేయడం జరిగింది..

ప్రస్తుతం శ్రీనివాస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కల్వకుర్తి నందు అర్థశాస్త్రంలో  అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు..

రామిశెట్టి శ్రీనివాస్  పాఠశాల విద్యను nsp క్యాంపు స్కూల్లో, కళాశాల విద్యను KRR డిగ్రీ కళాశాలలో పూర్తి చేశాడు..

చిన్నతనం నుంచి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతూ విద్యాభ్యాసం కొనసాగించాడు..

వీరి కుటుంబం సీతారాం నగర్ లో కాలువ పక్కన గుడిసెలో నివాసం ఉండేవాడు..

తర్వాత కాల్వ పక్కనే ఇల్లు తీసేయడంతో  రామస్వామి గుట్ట దగ్గర వాళ్ల తల్లిదండ్రులు నివసిస్తున్నారు.. తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అంటూ తన మిత్రులు అందరూ కూడా రామిశెట్టి శ్రీనుని అభినందించడం జరిగింది..

రామిశెట్టి  శ్రీనివాస్  డాక్టరేట్ ( phd) doctor of philosophy)  తీసుకున్న సందర్బంగా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన  చిన్ననాటి మిత్రులు సులువ శ్రీను, త్రిపురం రమేష్ రెడ్డి, అంజయ్య,  కృష్ణ. క్రిష్ణయ్య,, రవి,, అహ్మద్ ఖాన్, మహేష్, మురళి, నాగరాజు, విజయ్ కుమార్, మధు,,నరసరావు, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, సతీష్, మరియు కల్వకుర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది అభినందనలు తెలియ జేశారు..