లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

_• తెలంగాణలో ఖాళీ కానున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలు._

_• మార్చి 29తో ముగియనున్న ఐదుగురు సభ్యుల పదవీకాలం._

మార్చి 3న రానున్న నోటిఫికేషన్

నామినేషన్ చివరి తేదీ మార్చి 10

నామినేషన్ల స్కృటీని మార్చి 11

నామినేషన్ల విత్ డ్రా కు మార్చ్ 13 చివరి తేదీ

మార్చి 20న పోలింగ్
అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు

నేటి నుంచి ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను అసెంబ్లీ స్పీకర్గా నామినేట్ చేయడానికి సీఎం రేఖా గుప్తా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుంది..

*అసెంబ్లీలో వాళ్లు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు: డిప్యూటీ పవన్ కళ్యాణ్*

ఆంద్రప్రదేశ్..
సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కీలక సూచనలు చేశారు.

వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అసభ్య పదజాలంతో రెచ్చగొట్టినా సరే.. జనసేన సభ్యులు సంయమనం పాటించాలని చెప్పారు.

రొచ్చిపోవద్దని హుందాగా వ్యవహరించాలని, బురదలో కూరుకుపోయిన వైసీపీ నాయకులు దాన్ని మనకు అంటించాలని చూస్తారని పేర్కొన్నారు..

నేడు మ్యాచ్‌లో బంగ్లాపై న్యూజిలాండ్‌ గెలిస్తే పాక్‌ ఇంటికే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ గెలిస్తే ఇక పాకిస్థాన్ జట్టు ఇంటిబాట పట్టాల్సిందే. ఆదివారం భారత్‌పై కీలక మ్యాచ్‌లో ఓడటంతో పాక్‌ సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టంలో పడ్డాయి. నేడు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇంటి ముఖం పట్టనున్నాయి. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్‌సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే..

దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలు

దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలు
దేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోనున్నాయి. గతేడాది కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయిని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి కూడా ముగియలేదు.. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీన్నిబట్టే ఈసారి ఎండలు ఎలా ఉండనున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సారి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట..

మహా కుంభమేళ పై అసత్య ప్రచారం.. కేసులు నమోదు

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని సామాజిక మాధ్యమాలు కుంభమేళా నీటిలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉందని తప్పుడు వార్తలు సృష్టించాయి. దీంతో సీరియస్ అయిన యూపీ గవర్నమెంట్ 140 సామాజిక మాధ్యమ ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు యూపీ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. ఇక ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో భయానక పరిస్థితులు..!

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్‌లో భయానక పరిస్థితులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు కొనసాగుతోన్న సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు..లోకో ట్రైన్‌లో సొరంగం లోపలికి వెళ్లి వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి మీడియాకు టన్నెల్ లోపలి పరిస్థితిని వివరించారు.

సొరంగంలో నీరు, బురద తోడేసే పనులు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి తెలిపారు. సొరంగంలోకి ఆక్సిజన్ పంపుతున్నట్లు చెప్పారు. సహాయక బృందాలు శనివరాం రాత్రి నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నాయని జూపల్లి చెప్పారు. రెస్క్యూ టీంలు టన్నెల్ బోర్ మిషన్‌కు వెళ్లాయని తెలిపారు.

అయితే, టన్నెల్ లోపల పరిస్థితి భయంకరంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నీటి ఉధృతికి బోరింగ్ మిషన్ కొట్టుకొచ్చిందన్నారు. అవసరమైన యంత్రాలు లోపలికి తీసుకెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు..

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై 25న సుప్రీంకోర్టులో విచారణ… టెన్షన్ లో ఎమ్మెల్యేలు..!

తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై దాఖలైన పలు పిటిషన్లు ఈ నెల 25న సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టు విచారణ జాబితాలో రిజిస్టార్ మెన్షన్ చేశారు..బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టీ. ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఎమ్మెల్యే లు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద్ సుప్రీంకోర్టు లో పిటిషన్లు దాఖలు చేశారు..అయితే ఈ పిటిషన్లు గత వారం విచారణ జాబితాలో మెన్షన్ అయినప్పటికీ… పలు కారణాల వల్ల ఆ రోజు విచారణ జరగలేదు. దీంతో శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి బెంచ్ ఎదుట పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత వారం కూడా అనివార్య కారణాలతో లిస్ట్ అయినా విచారణకు రాలేదని గుర్తు చేశారు. ఈ విజ్ఞప్తి ని పరిగణలోకి తీసుకొన్న బెంచ్.. ఈ నెల 25న వాదనలు వింటామని పేర్కొంది.
దీంతో ఏ క్షణమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఈనెల25న పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణకు రానుండంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనర్హత వేటుపై స్పష్టమైన సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్ ను కోరింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది. దీంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని పది మంది ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు.
కాగాపార్టీ ఫిరాయింపులు కేసులో ..తెలంగాణ స్పీకర్ పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి…మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ? అంటూ తెలంగాణ స్పీకర్ ను నిలదీసింది. రీజనబుల్ టైమ్ అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా ? అంటూ తెలంగాణ స్పీకర్ ను అడిగింది సుప్రీం కోర్టు. దీంతో తెలంగాణ స్పీకర్ ను అడిగి నిర్ణయం చెపుతామని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు. పార్టీ ఫిరాయింపులు జరిగి పది నెలలు అవుతున్న స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని అటు బీఆర్ఎస్ తరపున లాయర్ వాదనలు వినిపించారు.