*🔹నేడు ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుపై హైకోర్టులో విచారణ*
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించనున్న తెలంగాణ హైకోర్టు.. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ కౌంటర్.. అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలన్న ఏసీబీ.. నేటితో ముగియనున్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల గడువు..
*🔹మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది*
జల్పల్లిలోని అడవిలో అడవి పందులను వేటాడిన విష్ణు సిబ్బంది.. అడవి పందులను వేటాడి తీసుకువెళ్లిన మేనేజర్ కిరణ్.. వేటాడిన అడవి పందిని బంధించి తీసుకువెళ్లిన ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్.. అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్.
*🔹జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం*
4న సాయంత్రం సచివాలయంలో సమావేశం
*• కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై చర్చ యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపైనా చర్చించే అవకాశం*
*• భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు సాయం..*
_• డెడికేటెడ్ కమిషన్ నివేదికతో పాటు..ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం.._
కేటీఆర్‌పై 409 సెక్షన్ అమలు చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్..!
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరుపుతుంది…ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున అడ్వకేట్ సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. లంచ్ సమయానికి కేటీఆర్ తరపు అడ్వకేట్ వాదనలను కోర్టు విన్నది. ఇప్పుడు ఏసీబీ తరపు న్యాయవాది వాదనలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏసీబీ డీఎస్పీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్‌పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని ఏసీబీ కోరింది. నాట్ టు అరెస్ట్‌పై కేటీఆర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
కోర్టులో కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు ఇలా కొనసాగాయి. కేటీఆర్ ఫైల్ పైన సంతకం పెట్టాడని కేసు పెడితే దేశంలో ఇక ఏ మంత్రి కూడా ఫైల్ మీద సంతకాలు చేయరు. కేటీఆర్‌పై 409 సెక్షన్ అమలు చేస్తే దేశంలో గందరగోళం నెలకొనే ఛాన్స్ ఉంటుంది. బాంబే హైకోర్టులో ఇప్పటివరకు విచారణ జరిగిన కేసుల ఉదాహరణలు ఎన్నో మీకు అందజేయగలను. పర్మిషన్ తీసుకోలేదన్న విషయానికి సెక్షన్ 405 వర్తించదని అడ్వకేట్ సిద్దార్థ్ దవే కోర్టుకు తెలిపారు.
ఒక మంత్రిగా కేటీఆర్ నిర్ణయం తీసుకున్న బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారానే నిధులు ఆర్గనైజింగ్ టీంకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఏసీబీ చెపుతున్న రూ.8 కోట్లు కూడా కేటీఆర్ ఖాతాలోకి వెళ్లవు అని.. అవి కూడా నిర్వహకుల ఖాతాలోకి వెళ్తాయని వాదనలు వినిపించారు సిద్ధార్థ్ దవే.
ఇక డబ్బులు చేరిన సంస్థను నిందితుడిగా చేర్చలేదు అని అడ్వకేట్ సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు. విదేశీ సంస్థ పేరు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఎఫ్ఈవో వివరాలను సిద్ధార్థ్ దవే కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో కేటీఆర్‌కు 13(1)(a) సెక్షన్ అసలు వర్తించదు. ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేశాము. ఇక్కడ థర్డ్ పార్టీ లబ్ధి పొందింది అని చెప్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఎవరో ఎఫ్ఐఆర్లో ఎక్కడా చెప్పలేదు అని కేటీఆర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి అన్నది అవాస్తవం. అప్పటి మున్సిపల్ మంత్రిగా ఆయన ముందు పెట్టిన ఫైల్‌పై సoతకం చేసినందుకు నిందితుడుగా చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందలేదు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది. విదేశీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిబంధన ఉందా? అలా నిబంధన ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది అని అడ్వకేట్ సిద్ధార్థ్ దవే వాదించారు..
వేలు పెట్టి గెలికేసిన ట్రావిస్ హెడ్.. రంగంలోకి ICC ?..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగవ టెస్ట్ లో భారత జట్టు 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే…దీంతో ఐదు టెస్టుల సిరీస్ లో భారత జట్టు 1 – 2 తో వెనుకంజలో నిలిచింది. ఈ నాలుగవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో భారత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు తీవ్రంగా నిరాశపరిచారు..దీంతో భారత జట్టుకు వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ కీలకంగా మారింది. కానీ అతను కూడా నిర్లక్ష్య పూరిత బ్యాటింగ్ తో పెవిలియన్ చేరాడు. అప్పటివరకు సజావుగా సాగుతున్న భారత ఇన్నింగ్స్.. పంత్ వికెట్ కోల్పోగానే ఒక్కసారిగా సైకిల్ స్టాండ్ ని తలపించింది. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా పెవిలియన్ బాట పట్టారు. అయితే పంత్ వికెట్ తీసిన ఆనందంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ట్రావిస్ హెడ్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
హెడ్ తన ఫింగర్ సెలబ్రేషన్ తో సోషల్ మీడియాను అల్లాడించాడు. ఈ వేడుకను చాలామంది అశ్లీలంగా భావించారు. అయితే వికెట్ తీసిన సందర్భంలో చేతి వేలిని మరో చేతిలో పెట్టి తిప్పుతూ ట్రావిస్ హెడ్ చేసిన సెలబ్రేషన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు. హెడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కి విజ్ఞప్తి చేశారు. హెడ్ 150 కోట్ల భారత ప్రజలను అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ అసభ్యకరమైన సెలబ్రేషన్ పై సిద్దు ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తూ.. ” మెల్ బోర్న్ టెస్ట్ లో హెడ్ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉంది. ఇది జెంటిల్ మెన్ గేమ్ కి ఏ మాత్రం మంచిది కాదు. మ్యాచ్ ని చిన్నపిల్లల నుంచి మహిళలు, కుర్రాళ్ళు, పెద్దల వరకు చూస్తుంటారు. ఇలా ప్రవర్తించడం సరైంది కాదు. అతడు ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. అలాంటి సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. ఇంత నీచంగా వ్యవహరించడం సరైనది కాదు…భవిష్యత్తులో ఎవ్వరూ ఇలాంటి పనిచేయకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే ఇకపై ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు” అని ట్వీట్ చేసి బీసీసీఐ, ఐసీసీలకు ట్యాగ్ చేశాడు సిద్దు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అతని వేళ్లను మంచు మీద ఉంచాలనే ఒక జోక్ ని గుర్తు చేశాడని చెబుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమీన్స్ కూడా ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో చెబుతూ దానిని ఒక జోక్ గా అభివర్ణించాడు. ఏది ఏమైనా ఇది ఓ అసభ్యకరమైన చర్య అని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు…
జైసల్మేర్‌లో భూమిని చీల్చి 60 లక్షల ఏళ్ల నాటి నీరు బయటకు వచ్చిందా? భూగర్భ జల నిపుణుల షాకింగ్ వెల్లడి..
రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని మోహన్‌గఢ్ ప్రాంతంలో గత 3 రోజులుగా గొట్టపు బావి తవ్వడంతో భూగర్భంలో నుంచి బయటకు వస్తున్న వరద సోమవారం నిలిచిపోయింది..భూగర్భంలో నుంచి సహజంగా నీటి ప్రవాహం నిలిచిపోవడంతో జిల్లా యంత్రాంగం, ఇతర సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి.
నీటితోపాటు గ్యాస్ లీకేజీ ఆగిపోయింది.
అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే.. 60 లక్షల ఏళ్ల నాటి నాటి ఇసుక భూమి నుంచి బయటకు వచ్చిందని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, బయటకు వచ్చిన నీరు 60 లక్షల సంవత్సరాల నాటిది కావచ్చు. అటువంటి పరిస్థితిలో, దాని అధ్యయనం అవసరం. మరియు దీని కోసం చాలా బావులు తవ్వాలి.
ఇసుక నీటితో బయటకు వచ్చింది
వాస్తవానికి, సోమవారం, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, ఐఐటి జోధ్‌పూర్‌తో పాటు రాష్ట్ర భూగర్భజల బోర్డు ఇన్ఛార్జ్ మరియు సీనియర్ భూగర్భ జల శాస్త్రవేత్త డాక్టర్ నారాయణ్ ఇంఖియా మరియు ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఇక్కడ బోరింగ్ సైట్లో ట్రక్కులు, యంత్రాలు మొదలైన వాటిని భూమికింద పాతిపెట్టడానికి ONGC నుండి సాంకేతిక సహాయం కోరింది మరియు మళ్లీ నీటి ప్రవాహం ప్రారంభం కాకుండా చూసేందుకు సంక్షోభ నిర్వహణ బృందాన్ని కోరింది.
భూగర్భ జల నిపుణులు షాకింగ్ విషయం చెప్పారు. నీటితోపాటు బయటకు వచ్చిన ఇసుక కూడా తృతీయ కాలానికి సంబంధించినదని, ఇలాంటి పరిస్థితుల్లో భూమిలోంచి బయటికి వచ్చే నీరు లక్షల సంవత్సరాల నాటిది అయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
డిసెంబర్ 28న నీటి విడుదల ప్రక్రియ ప్రారంభమైంది
డిసెంబర్ 28వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో బీజేపీ మున్సిపల్ బోర్డు అధ్యక్షుడు విక్రమ్ సింగ్ పొలంలో బోరుబావి తవ్వుతుండడం గమనార్హం. దాదాపు 850 అడుగుల మేర తవ్విన తర్వాత ఒక్కసారిగా బలమైన ఒత్తిడితో నీరు రావడం మొదలైంది. ఒత్తిడిలో భూమి కింద నుంచి గ్యాస్ కూడా బయటకు వస్తోంది, దీని కారణంగా నీటి ప్రవాహం 10 అడుగుల ఎత్తులో ఉంది. ఈ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. రైతు పొలంలో నీరు నదిలా ప్రవహించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు మూడు తర్వాత అది ఆగిపోయింది..అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం, లీకేజీ ఏ సమయంలోనైనా మళ్లీ ప్రారంభమవుతుంది, విషపూరిత వాయువుల వంటి హానికరమైన పదార్ధాలను విడుదల చేస్తుంది. ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ సెక్షన్ 163 ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్ ఈ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. త్రవ్వకాల ప్రాంతానికి 500 మీటర్ల వ్యాసార్థంలో ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు…
మూడు ముక్కలు కాబోతున్న పాకిస్తాన్, తాలిబన్లతో యుద్ధమే పాక్ అంతమా?..
ఎవరు తీసుకున్న గొంతులో వారే పడతారంటే అది సామెత ఏమో అనుకున్నారు కానీ పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అలానే ఉంది… పాకిస్తాన్‌కు అచ్చంగా అతికినట్టు సరిపోతుంది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడగొట్టడానికి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూ వచ్చిందా దేశం…అందుకు మిలటరీని, నిఘా సంస్థలను ఉసిగొల్పింది. అవి కాస్తా సొంతంగా ఉగ్రవాదమనే భూతాన్ని సృష్టించాయి. దాన్ని ఉసిగొల్పి.. జిహాద్ పేరిట విధ్వంసాన్ని సృష్టించారు. కానీ, చేసిన పాపం ఊరికేపోదు కదా.. ఇప్పుడు టీటీపీ రూపంలో తాను తవ్వుకున్న గోతిలోనే తానే పడుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే మన దేశాన్ని విడగొట్టాలని పగటి కలలు కన్న పాకిస్తానే మూడు ముక్కలుగా మారేందుకు రంగం సిద్ధమైంది. అందుకు ఆఫ్ఘాన్ తాలిబన్లతో యుద్ధం ఒక ఆరంభం మాత్రమే. ఈ మాట స్వయంగా తాలిబన్ల నోటి నుంచే వచ్చింది. ఆ డీటెయిల్స్ ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..
అది 1971.. తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛకోసం పోరాడి భారత సైన్యం సాయంతో స్వతంత్రం సంపాదించుకుంది. బంగ్లాదేశ్‌గా అవతరించింది. పశ్చిమాన ఉన్న ప్రాంతం మాత్రమే పాకిస్తాన్‌గా మిగిలింది. ఇది ఆ దేశ చరిత్రలోనే ఓ పీడకలగా మిగిలిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్లో మళ్లీ ఆ సిట్యువేషనే కనిపిస్తోంది. ఎందుకంటే, తమ దేశంపై వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులకు దిగిన తాలిబన్లు ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లోని కీలక ప్రాంతం ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ తమదే అంటున్నారు. ఈ ప్రకటన స్వయంగా ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖ్వారిజ్మీనే చేశారు. అంటే, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను తాము ఆక్రమించుకోబోతున్నాం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్‌ను ఆనుకునే ఉంటుంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ పెంచి పోషించిన తెహ్రీక్-ఇ-తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే ఉండదు. తాలిబన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం, ఇప్పటికే తన ఆర్థిక పరిస్థితి దిగజారపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 జనవరిలో పాకిస్తాన్ అప్పటి అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా మిలిటరీ యాక్షన్‌పై కామెంట్స్ చేశారు. దీనికి కౌంటర్‌గా తాలిబన్లు 1971లో భారత సైన్యం ముందు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫొటోను షేర్ చేసి.. మరోసారి మిలిటరీ యాక్షన్ అంటే ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అన్నంత పనీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ తమదే అని తేల్చి చెప్పారు. కానీ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాను తాలిబన్లు ఆక్రమించుకున్నంత మాత్రాన పాకిస్తాన్ మూడు ముక్కలు ఎలా అవుతుంది? అసలు కథ ఇప్పుడే మొదలైంది.
పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా.. పాకిస్తాన్‌లోని మొత్తం రాష్ట్రాలు ఈ నాలుగే.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో రెండు ప్రాంతాలు ముజఫరాబాద్, గిల్గిట్-బాల్టిస్థాన్ ఉన్నాయి. ప్రస్తుతం ఒక పంజాబ్ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వేర్పాటువాదం పెచ్చరిల్లుతోంది. ఇది క్రమంగా విస్తరిస్తే ఆ దేశం తన అస్థిత్వాన్నే కోల్పోతుంది. పాక్‌లో పంజాబ్ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. జనాభాలో ఈ రాష్ట్ర వాటా దాదాపు 40 శాతం. అయితే వనరులు మాత్రం అందుకు సరిపడా లేవు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వనరులను దోచిపెట్టి పంజాబ్‌కు ఇస్తున్నారనే వాదన ఉంది. సైన్యం, దేశ పాలనలో కూడా వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా వేర్పాటువాదం బలపడింది. అది ఏ స్థాయిలో ఉందీ అంటే పాకిస్తాన్లో రక్తపాతం సృష్టిస్తున్న మెజారిటీ దాడులకు వేర్పాటువాదులే కారణం. వారిలో బలూచీలది మొదటి స్థానం.
నిజానికి.. పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు బలూచిస్తాన్‌తో ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో బలూచిస్తాన్ ఓ సంస్థానం. పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్‌ను 1948లో ఆక్రమించుకుంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బలూచిస్తాన్‌లో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడింది పాక్ ప్రభుత్వం. తమకు ఎదురుతిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసింది. ఎప్పుడైతే అణచివేతలు తీవ్రమయ్యాయో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురుతిరగడం మొదలుపెట్టారు. ఈ గ్రూపు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్తాన్‌లోని గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న నేపధ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది.
బలూచ్ తర్వాత ఆజాదీ కోసం పోరాడుతున్న మరో ప్రాంతం సింధ్. బ్రిటిష్ వారు తాము ఆక్రమించిన సింధూ రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపారు. నాడు మొగ్గ తొడిగిన పోరాటం యాభై ఏళ్లుగా వృద్ధి చెందుతూ వచ్చింది. దేశ విభజన అనంతరం లక్షలాదిమంది ముహజర్లు భారత్ నుంచి సింధ్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరిని పంజాబీ పాలకులు చిన్నచూపు చూడటంతో తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలన్న ఉద్యమం ప్రారంభమైంది. స్థానిక సింధ్ ప్రజల నుంచి ఈ డిమాండ్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దేశానికి జీవనాడైన కరాచీ పోర్టు ఇక్కడే ఉంది. పాకిస్తాన్ ఇప్పటి వరకూ సుమారు 60 మంది సింధ్ దేశ్ కీలక నేతలను హతమార్చింది. వేల మందిని జైళ్లలో బంధించింది. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సింధ్ దేశ్ పీపుల్స్ ఆర్మీ లాంటి సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. ఇలా పంజాబ్ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలూ ఎప్పుడు పాక్ చెర నుంచి బయటపడదామా అని చూస్తున్నాయి. ఈ పరిస్థితులకు కారణం ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెరపకురా చెడేవు అని ఊరికే అనలేదు..
అసెంబ్లీలో మల్లు సోదరుల గుసగుసలు..!?.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క.. ఆయన సోదరుడు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ సభ్యుడు మల్లు రవి గుసగుసలాడుకున్నారు. అసెంబ్లీ లాబీల్లోని భట్టి చాంబర్‌కు మల్లురవి రాగా, ఆ సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఇతరులు భట్టి చాంబర్లోనే ఉన్నారు..
దీంతో తన సోదరుడితో రహస్యంగా మాట్లాడి మల్లు రవి వెళ్లిపోయారు.
అయితే, అసెంబ్లీలో ఈ అన్నదమ్ములు ఎందుకు గుసగుసలాడారా అన్న విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా, రహస్యమేమీ లేదని ఎంపీ మల్లురవి చెప్పారు. అసెంబ్లీ ఆమోదం పొందిన మన్మోహన్సింగ్ సంతాప తీర్మానం ఇప్పించాలని, దానిపై తెలంగాణ ఎంపీల సంతకాలు పెట్టించి రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఇస్తానని భట్టికి చెప్పానని ఆయన వెల్లడించారు..
అమిత్ షా సంచలన నిర్ణయం.. తెలంగాణలోకి 2వేల కేంద్ర బలగాలు!
హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ పర్యటన తరువాత దండకారణ్యంలో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతాబలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపడుతున్నాయి…రాష్ట్ర సరిహద్దులు దాటి మరి సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా 2 వేల మంది భద్రతాబలగాలు చర్లమీదుగా తెలంగాణ అడవుల్లోకి వచ్చి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం సంచలనం రేపుతోంది. వేలసంఖ్యలో కేంద్ర జవాన్లు తెలంగాణ అడవులను జల్లెడ పడుతుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణనే సేఫ్ జోన్..
తెలంగాణ – ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని సైనిక శిబిరాలపై మావోయిస్టులు ఆకస్మిక దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో.. మావోయిస్టులు తెలంగాణ అడవుల్లోకి ప్రవేశించి సేఫ్ జొన్లను రెక్కీ చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ‘ఆపరేషన్ కగార్’ తారాస్థాయికి చేరుతుండటంతో తెలంగాణను సేఫ్ జోన్ గా మార్చుకునేందుకు మావోయిస్టులు యత్నిస్తున్నారనే సమాచారంతో కేంద్ర హోంశాఖ క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ చేపడుతోంది.
క్రాస్ బార్డర్ ఆపరేషన్లకు సిద్ధం..
ఇక ఇటీవల మావోయిస్టుల అడ్డాలో పర్యటించిన అమిత్ షా.. దండకారణ్యంవ్యాప్తంగా కేంద్రబలగాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. అవసరమైతే క్రాస్ బార్డర్ ఆపరేషన్లకు సైతం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణలో మావోయిస్టుల కార్యాకలాపాలపై నిగూఢ సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర ఇంటలిజెన్స్, ఎస్ఐబీకి సూచనలు ఇచ్చారు. తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టులు విధ్వంసకరమైన ఘటనలకు పాల్పడుతారనే సమాచారం ఉందన్న పోలీసు అధికారులు.. తెలంగాణ గ్రేహౌండ్స్ లో ఏఎస్పి క్యాడర్లో పనిచేస్తున్న పదిమంది యువ ఐపీఎస్‌లను దండకారణ్యం జోన్లోకి ట్రాన్స్ ఫర్ చేసినట్లు సమాచారం. …
సొంత తల్లిని పెళ్లి చేసుకున్న కొడుకు…. ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా..!?
ఈ సమాజంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఎక్కువగా జరుగుతాయి. మరికొందరు ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. ఇంకొందరు వరుసకు మరదలు లేదా బావా అయ్యేవారిని జీవిత భాగస్వామిగా స్వీకరిస్తారు..చాలావరకు తల్లిదండ్రుల సమక్షంలోనే వధూవరుల పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే పాకిస్థాన్‌లో మాత్రం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్ అనే యువకుడు ఏకంగా తన సొంత తల్లినే పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో అతడు పెళ్లికి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. ” గత 18 ఏళ్లుగా మా అమ్మ మా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆమెకు ప్రత్యేక జీవితాన్నిచ్చేందుకు నాకు తోచినంత నేను సాయపడ్డాను. ఆమెకు తన జీవితాన్ని ప్రశాంతంగా గడిపే హక్కు ఉంది. అందుకే ఒక కొడుకుగా ఈ పని చేయడం నాకు కరెక్ట్ అనిపించింది. 18 ఏళ్ల తర్వాత మా అమ్మకు ప్రేమను, జీవితాన్ని అందించేందుకు రెండో అవకాశంగా దీన్ని సపోర్ట్ చేశానని” అబ్దుల్ వివరించాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరలయ్యింది. నెటిజెన్లు కూడా ఆ యువకుడిని ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు. తన తల్లిని పెళ్లి చేసుకొని అండగా నిలిచినందుకు మద్దతు తెలుపుతున్నారు..
https://www.instagram.com/reel/DDuKhwGCtp3/?igsh=Ymd5enJhMzRvMHp5
ఆ తర్వాత అబ్దుల్ పెళ్లి వేడుక ఫొటోను కూడా షేర్ చేశాడు. ” మోహమాటం వల్ల మా తల్లి పెళ్లి గురించి విషయం చెప్పేందుకు కొన్ని రోజులు పట్టింది. మాపై మీరు ప్రేమను చూపించినందుకు, మాకు మద్దతుగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఎలా ప్రశంసిస్తున్నారు, గౌరవిస్తున్నారనే విషయం అమ్మకు చెప్పాను. దీనికి మేమిద్దరం కృతజ్ఞులం. మీరు పంపించే ప్రతీ మెసెజ్‌కు, కామెంట్స్‌కు నేను స్పందించలేకపోవచ్చు. కానీ మీరు పంపే ప్రతీఒక్కటి కూడా మాకు ఆశీర్వదామే” నని రాసుకొచ్చారు. అయితే కొడుకు సొంత తల్లిని పెళ్లి చేసుకోవడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా పలు దేశాల్లో ఇలా సొంత తల్లిని కొడుకు వివాహం చేసుకున్న సందర్భాలున్నాయి..