లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్

*రోజుకు రూ.10 లక్షలు లిమిట్..*

*దేశ దర్మం కోసం ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్*

శుక్రవారం(జనవరి 31)తో జనవరి నెల ముగియనుంది.. రేపటి నుంచి ఫిబ్రవరి నెల. అంటే, ఫిబ్రవరి 1.. కేంద్ర బడ్జెట్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెడతారు. అందరి చూపు బడ్జెట్‌పైనే ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం.. శనివారం నుంచి బడ్జెట్‌తో పాటు కొన్ని ముఖ్యమైన మార్పులు జరగనున్నాయి. అవి తప్పక తెలుసుకోవాలి.

ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలు ఉన్న UPI లావాదేవీలకు పే,మెంట్స్ చేయలేరు. ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) ఉన్న యూపీఐ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వీటితో పాటు IMPS ద్వారా రోజుకు రూ.10 లక్షల వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు.

1. LPG సిలిండర్ ధర పెంపు
ఎల్‌పిజి ధరలు దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటి తేదీన సవరించబడతాయి. అందులో భాగంగా ఫిబ్రవరి 1 నుండి 14.2 కిలోల LPG సిలిండర్ ధర రూ. 50 పెరగనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సబ్సిడీ పథకాలు కొనసాగుతుండగా, పట్టణ వినియోగదారులు పెరిగిన ఖర్చులు భరించాల్సి ఉంటుంది.

2. UPI లావాదేవీల్లో భారీ మార్పు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. UPI లావాదేవీల్లో భారీ మార్పులు చేపట్టింది. అందుకు సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 1 నుండి UPI ఐడీలలో ప్రత్యేక అక్షరాలు ఉంటే అటువంటి వాటికి పేమెంట్స్ చేయలేరు. ఆల్ఫా-న్యూమరిక్ (A- to Z, 0- to 9) ఉన్న యూపీఐ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

Also Read :- బడ్జెట్ 2025 నుంచి ప్రధాన అంచనాలు
అలాగే.. NPCI.. యూపీఐ లావాదేవీ IDల కోసం బయోమెట్రిక్ OTP ప్రమాణీకరణను తప్పనిసరి చేస్తుంది. స్కామ్‌ల ప్రమాదాన్ని తగ్గించడమే దీని లక్ష్యం.

3. IMPS పరిమితి పెంపు
ప్రస్తుతమున్న రూ. 5 లక్షల పరిమితిని NPCI.. రూ. 10 లక్షలకు పెంచింది. దాంతో, ఫిబ్రవరి 1 నుండి IMPS ద్వారా రోజుకు రూ.10 లక్షల వరకు బదిలీ చేయవచ్చు. లబ్ధిదారుని పేరును పేర్కొనకుండా రూ. 7 లక్షల వరకు తక్షణ బదిలీలు చేయవచ్చు.

4. పెరగనున్న మారుతీ కార్ల ధరలు
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సంస్థ.. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 1 నుండి పలు మోడళ్లపై ధరలను పెంచాలని నిర్ణయించింది. Alto K10, S-Presso, Celerio, Wagon R, Swift, DZire, Brezza, Ertiga, Eeco, Ignis, Baleno, Ciaz, XL6, FrontX, Invicto, Jimny అండ్ Grand Vitara వంటి కార్లపై ఈ భారం ఉండనుంది.

5. NPS ఉపసంహరణ 30 శాతం పెంపు
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA).. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో NPS కింద పాక్షిక ఉపసంహరణ పరిమితిని 30 శాతానికి పెంచుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది.

6. SBI హోమ్‌లోన్ ఇంట్రస్ట్ తగ్గింపు
దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా(SBI).. ఫిబ్రవరి 2025 నుండి కొత్త గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. రుణగ్రహీతలు 8.4% నుండి 8.1% వరకు వార్షిక వడ్డీ రేటు తగ్గింపుతో రుణాలను పొందవచ్చు.

పైవాటితో పాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన ఎయిర్ టర్బైన్ ఇంధన ధరలను సవరిస్తాయి..

*పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది: రాష్ట్రపతి ముర్ము*

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం అంశాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.12వేల కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు..

*కేంద్ర బడ్జెట్ 2025-2026* :

– యూరియా ఉత్పత్తిలో స్వయంసమృద్ధికి కొత్త కర్మాగారాలు.
–
– ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పది సూత్రాల్లో రెండోది ఎంఎస్ఎంఈ రంగం.
–
– ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం
– ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు.
–
– 27 రంగాల్లో స్టార్టప్‍లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ.
–
– నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు.
–
– సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు
– ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు
– ఎంఎస్‌ఎంఈలకిచ్చే రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు.
–
– స్టార్టప్‌లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు.
–
– బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం.
–
– మేడిన్ ఇండియా బ్రాండ్ కింద బొమ్మల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహం..

*కేంద్ర బడ్జెట్ 2025-2026* :

– క్లీన్‍టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం.
–
– పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్.
–
– రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు.
–
– వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు.
–
– దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు.
–
– సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు.
–
– జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం.
–
– ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు
– రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు.
–
– పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు
– 8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది బాలింతల కోసం అంగన్వాడీ 2.0.
–
– దేశవ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‍ల ఏర్పాటు.

*రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.*

గచ్చిబౌలిలోని ఓ పబ్‎లో పాత నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా.. దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. నిందితుడు రెండురౌండ్లు ఫైరింగ్ చేయడంతో ఓ కానిస్టేబుల్, బౌన్సర్‎కు గాయాలు అయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు చివరకు దొంగను అదుపులోకి తీసుకున్నారు. *గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‎లో* శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.

నిందితుడి కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్, బౌన్సర్‎ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పబ్‎లో ఒక్కసారిగా ఫైరింగ్ జరగడంతో అక్కడికి వచ్చిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గచ్చిబౌలిలో కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. పోలీసుల ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు…

దేశవ్యాప్తంగా 20చోట్ల విద్యాసంస్థల్లో సీబీఐ సోదాలు.

NAAC రేటింగ్స్ కోసం లంచాలు ఇచ్చినట్టు ఆరోపణ
10 మందిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు
గుంటూరుకు చెందిన ఓ యూనివర్సిటీ ఉద్యోగులు..
NAAC అధికారులను అదుపులోకి తీసుకున్న సీబీఐ
చెన్నై, విజయవాడ, బెంగళూరు, భోపాల్, ఢిల్లీలో సోదాలు
నగదు, బంగారం, సెల్‌ఫోన్లు..
ల్యాప్‌ట్యాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్టు గుర్తింపు
రూ.37లక్షలు, 6ల్యాప్‌ట్యాప్‌లు, సెల్‌ఫోన్ స్వాధీనం
పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం సీబీఐ అధికారులు..

*శ్లాబుల మార్పుల వల్ల ఎవరికెంత లాభం?*

కొత్త పన్ను విధానంలో తాజా మార్పుల వల్ల రూ.12 లక్షల ఆదాయం పొందుతున్న వారికి రూ.80వేలు మేర ఆదాయపు పన్ను లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రూ.18 లక్షలు ఆదాయపు పొందుతున్న వారికైతే రూ.70 వేలు (ప్రస్తుతం 30 శాతం పన్ను అమలౌతోంది) మేలు చేకూరుతుందన్నారు. అదే రూ.25 లక్షలు ఆదాయం ఉన్న వారికి సవరించిన శ్లాబుల ప్రకారం దాదాపు రూ.1.10 లక్షలు లబ్ధి జరుగుతుందన్నారు. దీనివల్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల రూపంలో లక్ష కోట్ల రూపాయలు, పరోక్ష పన్నుల రూపంలో రూ.2600 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇప్పుడు క్లారిటీ వచ్చింది. చెప్తా.

శాలరీ 11 లక్షలు ఉంటె టాక్స్ ఉండదు.

అదే శాలరీ 13 లక్షలు ఉంటె మళ్ళీ
0-4 —- 0 టాక్స్
4-8 —- 5% టాక్స్
8-12 —- 10% టాక్స్
12-16 — 15% టాక్స్ .

*కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష కు నిరసనగా రేపు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా…*

రేపు సాయంత్రం 4 గంటలకు ట్యాంకుబండ్ అంబేత్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా.

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా టిపిసిసి నిరసన కార్యక్రమాలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షకు నిరసనగా టిపిసిసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు

ఈ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనునట్లు ఆయన ప్రకటించారు.

నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 3 నాడు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టిపిసిసి చీఫ్ పిలుపునిచ్చారు

నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థులు , డిసిసిలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ, మహిళ కాంగ్రెస్ విభాగం తో పాటు పార్టీ అనుబంధ సంఘాలు పాల్గొనాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు

నిరసనలో భాగంగా ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రి తెలంగాణ కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలి..

రోడ్డు కోసం అన్యాయంగా తమ భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగి ఒక రైతు, పెట్రోల్ పోసుకొని మరో రైతు ఆత్మహత్యాయత్నం

నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో హైదరాబాద్ టూ నంద్యాల వరకు జరుగుతున్న నేషనల్ హైవే 167 బైపాస్ రోడ్డు రి సర్వేకు పోలీసు బలగాలతో వచ్చిన అధికారులు

తమ భూముల్లోంచి బైపాస్ రోడ్డుకు సర్వే చేసి లాక్కుంటున్నారని రైతుల ఆవేదన

మ్యాప్ తో సంబంధం లేకుండా, పెత్తందార్ల భూముల నుంచి కాకుండా తమ పొలాల మీదుగా రోడ్డు పోయేలా సర్వే చేస్తున్నారంటూ రైతుల ఆరోపణ

రైతుల బాధ వినకుండా సర్వే చేస్తున్న అధికారులు.. రైతులకు అధికారులకు మధ్య వాగ్వివాదం

మనస్థాపానికి గురై శేఖర్ అనే రైతు పురుగుల మందు తాగి, కురుమయ్య అనే రైతు డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం….

13కుచేరిన అసమ్మతి గళాలు..!

కాంగ్రెస్‌లో రగులుతున్న అసంతృప్తి కుంపటి ఇప్పట్లో చల్లారేటట్టు లేదు. శుక్రవారం రాత్రి సమావేశమైన నల్లగొండ, పాలమూరుకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మ రింతమంది జతకడుతున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. శనివారం వరంగల్‌ జిల్లాకు చెందిన మరో ముగ్గు రు ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేతలతో జత కలిశారని ప్రచారం జరుగుతున్నది. దీంతో తిరుగుబాటుదారుల సంఖ్య 13కు చేరినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్‌-2గా చెప్పుకుంటున్న మంత్రిని టార్గెట్‌గా చేసుకొని తిరుగుబాటు మొదలైనట్టు సమాచారం. పార్టీని కాపాడుకోవడానికి నోరు విప్పాల్సిందేనని, రూ.కోట్లకుకోట్ల డబ్బు మూటలతో వచ్చి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చాలనుకునే వారిని పార్టీ నుంచి బయటికి పంపే వరకు వెనక్కి తగ్గవద్దని, త్వరలోనే రాహుల్‌గాంధీని కలిసి ఫిర్యాదుచేయాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు నిర్ణయించినట్టు తెలిసింది. ఒక మంత్రి వసూళ్ల దందా మీద తిరుగుబాటు చేస్తూ, పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైన విషయాన్ని పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ ‘కాంగ్రెస్‌లో కుంపటి’ శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌లో దుమారం రేపింది. దీంతో కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది..

కాంగోలో భీకర పోరు.. 700 మంది మృతి.

కాంగో సైన్యం, రువాండా మద్దతున్న ఎం23 తీవ్రవాదుల మధ్య భీకరపోరు సాగుతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ పోరాటంలో కనీసం 700 మంది చనిపోగా మూడు వేల మంది వరకు గాయాలపాలయ్యారని పేర్కొంది..ఇప్పటికే గోమా నగరాన్ని, ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వా«దీనం చేసుకున్న తీవ్రవాదులు దక్షిణాన ఉన్న కివు ప్రావిన్స్‌లోకి శరవేగంగా చొచ్చుకు వస్తున్నారని వెల్లడించింది.

ఈ క్రమంలో జరుగుతున్న పోరులో భారీగా ప్రాణనష్టం సంభవించిందని వివరించింది. తీవ్రవాదులు మరో విమానాశ్రయాన్ని సైతం స్వా«దీనం చేసుకునే ప్రమాదముందని పేర్కొంది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని కొన్ని గ్రామాలను ఆర్మీ తిరిగి స్వా«దీనం చేసుకున్నారని ఐరాస పేర్కొంది. గోమా తీవ్రవాదుల వశం కావడంతో విదేశీ సాయుధ ముఠాలు లొంగుబాట పట్టడం, పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోవడంతో కాంగో ఆర్మీ బలహీనపడిందని వివరించింది. కాంగోలోని సాయుధ గ్రూపుల్లో ఎం23యే అతిపెద్దది..

కుంభమేళా వెళ్లే భక్తులను నడి రోడ్డు మీద వదిలేసిన డ్రైవర్..

మెహిదీపట్నం వద్ద బస్ ట్రబుల్ ఇవ్వడంతో.. మరో బస్సు సిద్ధం చేశారు. అందులో వసతులు సరిగ్గా లేవని.. ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో.. మేడ్చల్ చేరుకున్నాక బస్సు ఆపి, పారిపోయాడు డ్రైవర్.

The driver left the Kumbh Mela devotees on the road
మధ్యాహ్నం 3 గం. నుంచి.. రోడ్డు మీదే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. అటు నడిరోడ్డుపై వదిలేయడంతో… ప్రయాణికులు సీరియస్‌ అయ్యారు.. న్యూ ధనుంజయ ట్రావెల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ బస్సు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ డ్రైవరన్నా.. ఇంత పని చేశావేంటి..? అంటూ ఈ సంఘటనపై జనాలు స్పందిస్తున్నారు.

సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన..

భారత రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. ఈ మేరకు నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని మెయిన్‌ రోడ్డులో గాంధీ జంక్షన్‌ వద్ద ఆ పార్టీకి చెందిన నబరంగ్‌పూర్‌ ఎమ్మెల్యే గౌరీ శంకర్‌ మజ్జి నేతృత్వంలో ఆందోళన చేపట్టారు..వెనుకబడిన వర్గాలకు చెందిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తోందన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదన్నారు. గిరిజన తెగకి చెందిన ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలను తాను ఒక గిరిజనుడిగా ఖండిస్తున్నానని గౌరీ శంకర్‌ మజ్జి ప్రకటించారు.

జయపురం: పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్స్‌ ప్రారంభంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియా గాంధీ చేసిన వాఖ్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రసంగంపై అక్కసుతో బోరు కొట్టిందని, రాజకీయంగా ఉందని సోనియగాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో కూడినవిగా పేర్కొన్నారు. ఈ మేరకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఆమె తన పదవికి రాజీనామా చేయాలన్నారు. అనంతరం జయపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎస్‌.మనోజ్‌ నేతృత్వంలో సోనియా గాంధీ చిత్రపటానికి దగ్ధం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చ పట్టణ అధ్యక్షురాలు భవానీ రెడ్డి, జయపురం బీజేపీ మండల్‌ ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ పాణిగ్రహి, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యురాలు సురభి పాణి, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ శాశ్వత సభ్యుడు గౌతమ సామంతరాయ్‌, సన చౌదరి తదితరులు పాల్గొన్నారు.

రాయగడ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలు క్షమాపణ చెప్పాలని బీజేపీ శ్రేణులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా స్థానిక కాపిలాస్‌ కూడలి వద్ద శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో బీజేడీ జిల్లా అధ్యక్షుడు శివ కుమార్‌ పట్నాయక్‌, కొరాపుట్‌ ఎమ్మెల్యే రాఘురామ్‌ మచ్చ తదితరులు పాల్గొన్నారు.

గాంధీ భవన్‌కు రండి.. జానారెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ ఫోన్.!

పార్టీని మరింత పటిష్ఠపరిచేందుకు పీసీసీ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ప్రతిష్ఠను కాపాడుకునేందకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..ఇప్పటికే సీనియర్లకు కబురు పంపింది. గాంధీ భవన్‌కు వచ్చి.. ప్రతిపక్షాల నోటికి తాళం వేయాలని సూచించింది. పీసీసీ సారథి మహేశ్కుమార్‌ గౌడ్ తాజాగా..కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన జానారెడ్డికి ఫోన్‌ చేయడం సంచలనం రేపింది. అప్పుడప్పుడు గాంధీభవన్‌కు రావాలని కోరారు. ఇంకొందర్ని కూడా గాంధీభవన్‌కు ఆహ్వానిస్తున్నారు. గాంధీభవన్‌కు వారానికొకసారైన వచ్చేలా ప్లాన్ చేయాలని కాంగ్రెస్ వర్గాలను ఆయన కోరుతున్నారు. ఎన్నికలకు ముందు గాంధీభవన్ చుట్టూ చాలామంది నేతలు చక్కెర్లు కొట్టేవారు. కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునేందులు ఎత్తుకు పైఎత్తులు వేసేవారు. ఎన్నికలయ్యాక వారిలో చాలామంది గాంధీభవన్‌ను చూడడం మానేశారు. దీనిని అడ్వాంటేజ్‌గా తీసుకొంటున్న ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్.. రోజుకొక ఇష్యూ రోడ్డెక్కుతుంది.

బీఆర్ఎస్ విష ప్రచారం

తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో సజావుగా సాగుతున్న ప్రజాపాలనపై బీఆర్ఎస్ దండయాత్ర చేస్తోంది. కాంగ్రెస్‌పై బురద జల్లేందుకు.. బీఆర్ఎస్ సోషల్మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్‌ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సీనియర్లు ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ అంతర్మథనం చెందుతుంది. ఎంపీలు చామల కిరణ్కుమార్‌రెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్వర్కింగ్ప్రెసిడెంట్తూర్పు జగ్గారెడ్డి, పీసీసీ మీడియా కమిటీ చైర్మన్సామ రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్మినహా మిగతా వారు గాంధీభవన్ ముఖం చూడడం మానేశారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది.

అందువల్లే బీఆర్ఎస్, బీజేపీల విమర్శలపై కౌంటర్ఎటాక్‌లు తగ్గుముఖం పట్టాయని పీసీసీ అంచనా వేస్తోంది. కాంగ్రెస్‌లో చరిష్మా ఉన్న నేతలు సైతం గాంధీభవన్మెట్లు ఎక్కకుపోవడంతో ఆ రెండు పార్టీలు పేట్రేగుతున్నాయని భావించి.. సీనియర్లకు పీసీసీ ఫోన్లు చేస్తోంది. ఢిల్లీ స్థాయి నేతలు వచ్చినప్పుడు మినహా..మిగతా సమయాల్లో పెద్ద లీడర్లు గాంధీభవన్ వైపు రావడం లేదని పీసీసీ చీఫ్మహేశ్‌కుమార్‌గౌడ్ గుర్తించి…సీనియర్లను అప్రమత్తం చేశారు. అందులో భాగంగానే జానారెడ్డికి తాజాగా ఫోన్ చేశారు. గాంధీభవన్ ద్వారా కాంగ్రెస్ పాలన గొప్పతనాన్ని మీడియాకు వివరిస్తే…ప్రతపక్షాల నోటికి తాళం పడడం ఖాయమని పీసీసీ భావిస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు గాంధీభవన్ బాట పడితే..బీజేపీ, బీఆర్‌ఎస్ ఇమేజ్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది..

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలకు విసుగొచ్చింది

రైతు భరోసా 26 జనవరి రాత్రి టికు టికుమని రైతుల ఖాతాల్లో పడుతుందన్నాడు సీఎం… టికు టికు లేదు.. టంగుటంగు లేదు.. మాటలకు చేతలకు పొంతన లేని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విసుగు వచ్చిందంటూ రైతులు ఎమ్మెల్యే హరీశ్‌రావుకు విన్నవించారు. శనివారం సిద్దిపేట రూరల్‌ మండలం బండచర్లపల్లి వద్ద రైతులు ఎమ్మెల్యే హరీశ్‌రావుతో ముచ్చటించారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తానని చెప్పి రూ.లక్ష కూడా సరిగ్గా చేయలేదన్నారు. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టారని, యాసంగి పంటకు డౌటే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్‌ సార్‌ ఉన్నప్పుడు మంచిగా టైమ్‌కు అందరికీ రైతుబంధు వస్తుండే, ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినంక ఇప్పుడు ఎవరికీ వేస్త్తలేరు, కొత్తగా ఆత్మీయ భరోసా అంటుండ్రు, ఏది వచ్చేటట్టు లేదు.. ఏమి ఇచ్చేటట్టు లేడు… మల్ల ఎలక్షన్‌ కోడ్‌ వస్తుంది, సర్పంచ్‌ ఎలక్షన్ల కోసమే ఇస్తా ఇస్తా అంటుండు… ఇస్తానని చెప్పడం తప్ప ఇచ్చుడు లేదని హరీశ్‌రావు ముందు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యలు విన ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని, రైతుల హకుల కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు.

ఎంపీలుండి ఏంలాభం?.. ఆ రెండు పార్టీలు రాష్ర్టాన్ని నిలువునా ముంచుతున్నయ్‌: కేటీఆర్‌.

ఆ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తే బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. వరుసగా రెండో ఏడాది తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తేలేకపోయిన కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్‌ఎస్‌ మాత్రమే తెలంగాణ హకులను, జాతి ప్రయోజనాలను కాపాడగలుగుతుందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ చెప్పిన మాట మరోసారి గుర్తుకు వస్తుందని తెలిపారు. లోక్‌సభలో తెలంగాణ ఇంటిపార్టీ అయిన బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బీహార్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ర్టాలకు దకిన ప్రాధాన్యం చూసి జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైందన్నారు.

ఇద్దరు కేంద్రమంత్రులతో ఏం ప్రయోజనం?.

డబుల్‌ ఇంజిన్‌ సరార్‌ అంటూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు నిధులు తేస్తామంటూ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీ గెలిచినా అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు నయా పైసా తీసుకురాలేదని కేటీఆర్‌ విమర్శించారు. ఇతర రాష్ర్టాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు, మంత్రులు నిస్సహాయ, చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.