ఏపీ లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులు ఈడీ అటాచ్.
రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్ చేసుకున్న ఈడీ
కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్య ఆస్తులు అటాచ్
రూ.1048 కోట్లు కొల్లగొట్టారని పేర్కొన్న ఈడీ..
ఏపీ లిక్కర్ కేసు(Ap Liquor Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు కేసిరెడ్డి(Kesireddy), వాసుదేవరరెడ్డి(Vasudevareddy), చాణక్య(Chanakya)కు సంబంధించిన రూ. 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరోవైపు వారి కుటుంబసభ్యులు, అనుబంధ సంస్థల అస్తులను కూడా ఈడీ అధికారులు జప్తు చేశారు. సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు రూ.4 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు వినిపించాయి…
పాత లిక్కర్ బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, ఫేవర్ బ్రాండ్లకు స్పెషల్ ఆర్డర్లు ఇచ్చారని ఈడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. అయితే ఈ వ్యవహారంలో ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం దాకా కిక్బ్యాక్ తీసుకున్నట్లు విచారణలో తేలింది. అంతేకాదు కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు కూడా ఆపేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు..
2019 తర్వాత లిక్కర్ పాలసీలో నిందితులు మార్పులు చేసినట్లు అధికారులు గుర్తించారు. పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించినట్లు కూడా బయటపడింది. ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలింది. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్బ్యాక్ తీసుకున్నట్లు వెల్లడైంది. అటు కమిషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేసినట్లు అధికారులు తెలసుకున్నారు..
అటు సిట్ కూడా..
అటు సిట్ కూడా ఈ కేసులో దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించింది. తాజాగా ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డిని సైతం ప్రశ్నించింది. రెండు రోజలు పాటు విచారించిన అనంతరం ఆయన్ను గుంటూరు జైలుకు తరలించారు. ఇది జరిగిన గంటల్లోనే వాసుదేవరరెడ్డితో పాటు కేసిరెడ్డి, చాణక్యకు సంబంధించిన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.